Dil Raju: తెలంగాణ వేస్ట్ ఆంధ్రానే బెస్ట్.. నోటిదూలతో వివాదంలో ఇరుక్కున్న దిల్ రాజు.?
Dil Raju: సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజ్ మంచి పేరు సాధించారు. అలాంటి దిల్ రాజు ఈ సంక్రాంతిని మొత్తం ఊపెయ్యబోతున్నారు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నింటిని ఆయన నిర్మించడంతో ఈ సంక్రాంతి దిల్ రాజు సంక్రాంతి గా మారిపోయింది. ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10వ తేదీన మన ముందుకు రాబోతోంది.సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలువబోతోంది.
Telangana waste Andhra is the best Dil Raju shocking comments
ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు దిల్ రాజు. అంతేకాకుండా డాకూ మహారాజ్ చిత్రాన్ని కూడా నైజాంలో ఆయన రిలీజ్ చేయబోతున్నారు. ఈ విధంగా సంక్రాంతి బరిలో అన్ని సినిమాలు దిల్ రాజే నిర్మించడంతో ఇందులో సంక్రాంతికి ఏవీ హిట్ అవుతాయో తెలియడం కష్టంగా మారింది. అలాంటి ఈ తరుణంలో నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ట్రైలర్ ఈవెంట్ ని నిర్వహించారు. (Dil Raju)
Also Read: Hansika: హన్సికపై గృహహింస కేసు.. డబ్బు కోసం నన్ను టార్చర్ చేసిందంటూ కేసు పెట్టిన వదిన.?
ఈ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.. ఇందులో ఆంధ్ర ఆడియన్స్ ని పొగుడుతూ తెలంగాణ ఆడియన్స్ ని కించపరుస్తూ మాట్లాడారు. సినిమాలు వస్తే తెలంగాణ ఆడియోన్స్ లో పెద్దగా వైబ్ ఉండదని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటేష్ కు చెబుతూ మా ఆడియన్స్ తెల్ల కల్లు, మటన్ కి మాత్రమే వైబ్ ఇస్తారని ఆంధ్ర ఆడియన్స్ సినిమాలకు వైబ్ ఇస్తారని అన్నారు.
ఉదయం లేవగానే నీర తాగితే అదిరిపోతుందని మా వాళ్ళు నీర తాగుతూవైబ్ పొందుతారని చెప్పారు. ఈ విధంగా దిల్ రాజు తెలంగాణ ప్రజల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నేటిజన్స్ తెలంగాణ వ్యక్తివై ఉండి ఇలా తెలంగాణ వారిని అవమానించడం దారుణం అంటూ తిట్టిపోస్తున్నారు. అంతే కాదు కొంతమంది దిల్ రాజును తీవ్రంగా ట్రోల్ చేస్తూ దారుణంగా తిడుతున్నారు.(Dil Raju)