Thandel: ‘తండేల్’ ఫిబ్రవరి రిలీజ్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Why Thandel

Thandel: సంక్రాంతి సీజన్ సినిమాల విడుదలకు అనుకూలమైన సమయం. అలా ఈ ఏడాది పలు పెద్ద బడ్జెట్ చిత్రాలు సంక్రాంతికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, నాగ చైతన్య మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘తండేల్’ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందనుకున్నారు కానీ ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025కి వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వెనుక పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. థియేటర్ అలోకేషన్ సమస్యలను తప్పించుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల నాణ్యత పెంచడం, మరియు సోలో రిలీజ్ ద్వారా మంచి రిజల్ట్ సాధించడం వంటి అంశాలు నిర్మాతలు ఆలోచించారట.

Why Thandel avoids Sankranti competition?

సంక్రాంతి పోటీ నుంచి బయటపడటం అనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న మొదటి ప్రధాన కారణం. సంక్రాంతికి విడుదలయ్యే ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతి వస్తున్నాం’ ‘ గేమ్ ఛేంజర్’ లాంటి బడ్జెట్ చిత్రాలు భారీ ప్రేక్షకాధరణ పొందే అవకాశముంది. ఈ నేపథ్యంలో, తండేల్ సినిమాకు తగినంత స్క్రీన్లు లభించకపోవచ్చు. ఫిబ్రవరిలో సోలో రిలీజ్ చేస్తే, సినిమా పెద్దగా హైప్ సంపాదించడమే కాకుండా, ఎక్కువ స్క్రీన్ లభించి, బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన ఇవ్వగలదని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి కావలసిన సమయం కూడా ఈ నిర్ణయానికి కారణమైంది. సాంకేతిక నాణ్యత, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పై మరింత శ్రద్ధ పెట్టాలనే ద్దేశంతో పనులు జాప్యం అయ్యాయి. ప్రీ-రిలీజ్ ప్రచారానికి సమయం దొరకడం, పాటలు, ట్రైలర్ రిలీజ్ వంటి కార్యక్రమాల ద్వారా సినిమాపై ఆసక్తి పెంచడం ఈ గ్యాప్ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం, ట్రైలర్ కోసం ఎదురుచూపులు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *