Harish Rao: గోదావరి బోర్డులో తెలంగాణ ప్రాజెక్టుల నిలుపుదలపై రేవంత్పై ఫైర్

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు (GRMB) ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన ఏడు ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ప్రతిపాదించినా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఊరుకుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిలదీసిన తర్వాతే స్పందించడం ఏంటని ఎక్స్ వేదికగా హరీష్ రావు ఫైర్ అయ్యారు.

ఇంతకాలం తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నోరు ఎందుకు మెదపలేదని హరీష్ రావు తీవ్రంగా నిలదీశారు. ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది కదా అని ఆయన ప్రశ్నించారు. అలా చేయకుండా బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిన తర్వాత మాత్రమే హడావుడిగా లేఖలు రాయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

GRMB సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే.. ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నిలబడాల్సిందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎందుకు GRMBని నిలదీయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? అని ఆయన వరుస ప్రశ్నలతో రేవంత్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఇలాంటి అజాగ్రత్త వైఖరి ఆమోదయోగ్యం కాదని హరీష్ రావు హెచ్చరించారు.

Share your love