Election Commission: ఓటర్లకు టోకరా.. అలెర్ట్ జారీ

రాష్ట్రంలో ఓటర్లను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషన్ పేరుతో భారీ టోకరా జరుగుతోంది. ఈ మోసపూరిత సందేశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పేరుతో వస్తున్న లింకులు, మెసేజ్లను ఎవరూ నమ్మొద్దని, వాటిపై క్లిక్ చేయొద్దని స్పష్టం చేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటర్లకు సంబంధించిన అప్డేట్స్, నోటిఫికేషన్ల పేరుతో ఫేక్ మెసేజ్లు ప్రచారం అవుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సందేశాల వల్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఓటర్లను ఫోన్ చేసి అడగదు, వ్యక్తిగత వివరాలు అడగదు, లింకులు పంపదు అని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే అప్రమత్తం కావాలని, వాటిని ఫార్వార్డ్ చేయొద్దని సూచించారు. ఓటర్లు తమ సమాచారాన్ని కాపాడుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు.

ఈ మోసాల బారిన పడకుండా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి అనుమానాస్పద లింక్ వచ్చినా వెంటనే స్థానిక ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా ఓటరు వివరాలు, ఓటు ఐడీ నంబర్ వంటి వాటిని పంచుకోవద్దని గట్టిగా సూచించారు.

Share your love