Rain Season: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మానేసి బయటి ఆహారాన్ని తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండడంవల్ల ఇంట్లో వంట చేసుకోవడానికి సమయం లేకపోవడంతో బయట ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నవారు అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమవుతుంది. Rain Season
It has come in the Rain Season do not eat these at all
వర్షాకాలంలో బయటి ఆహారాన్ని తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. వర్షం పడడంతో దోమలు, ఈగలు ఎక్కువగా తయారవుతాయి. ఇవి ముఖ్యంగా బయట చేసే ఆహారంపైన వాలడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని మనం తినడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. Rain Season
Also Read: Orange Peel: నారింజ తొక్కే కదా అని తీసిపారేయకండి..గుండె జబ్బులతో 100 రోగాలకు చెక్..!
ముఖ్యంగా బయట పానీపూరి, నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, బజ్జీలు ఇంకా అనేక రకాల ఆహారాలు తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలకి కూడా సాధ్యమైనంతవరకు వర్షాకాలంలో బయటి ఆహారాన్ని తినిపించకపోవడం మంచిది. చిన్నపిల్లలకు చాలా త్వరగా వ్యాధులు సోకుతాయి. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు వంటి వ్యాధులు వస్తాయి. Rain Season
అందువలన చాలావరకు బయటి ఆహారాన్ని తినకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మంచిది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు, మాంసాహారం తినాలని చెబుతున్నారు. వాటిని తినే ముందు మంచినీటితో రెండు మూడుసార్లు శుభ్రం చేసుకుని తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని తినిపించాలి. Rain Season