Rahul Gandhi: ఇటు చూడు రాహుల్.. ‘హగ్’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో బీజేపీ షాకింగ్ రిప్లై

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. విదేశీ నేతలను కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఘాటుగా సమాధానమిచ్చారు. ఆయన తనదైన శైలిలో చరిత్రను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీకే అద్దం పట్టారు.

ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న బీజేపీ, వెంటనే ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే నిశికాంత్ దూబే సోషల్ మీడియా వేదికగా పాత ఫోటోలను షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను గుర్తు చేశారు. ఇందిరా గాంధీ క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రోను, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ను కౌగిలించుకున్న ఫోటోలను ఆయన షేర్ చేయడం గమనార్హం.

ఈ ఫోటోలతో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర గుర్తుందా అని బీజేపీ ఎంపీ ప్రశ్నించినట్టుగా ఉంది. విదేశీ నేతలను కౌగిలించుకోవడం విదేశాంగ విధానం కాదని రాహుల్ అన్నారు కానీ, తమ పార్టీ అధినేతలు గతంలో ఎలాంటి విదేశాంగ విధానాన్ని అనుసరించారో ఇప్పుడు ఆయన గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

Share your love