Tollywood heroes huge budget with no market

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క రేంజ్ మారిపోయింది. మినిమం 100 కోట్ల సినిమా అయితేనే బిజినెస్ ఉన్న హీరోలు సినిమాలు చేస్తామన్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. చిన్నాచితక హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడం ఇండస్ట్రీకి ఓ మంచి పరిణామమే అయినా కూడా దీని నుంచి ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది.

Tollywood heroes huge budget with no market

అదేమిటంటే పెద్ద హీరోలకు అభిమానులు ఉంటారు.. వారు ఎలాగైనా ఆయా హీరోల సినిమాలకు పెట్టిన డబ్బు వచ్చేలా చేస్తారు.. అంతేకాదు సాధారణ ప్రేక్షకులు కూడా పెద్ద హీరోల సినిమాలు అనేసరికి తప్పకుండా థియేటర్లో ఆయా చిత్రాలు చూడాలని చెప్పి వెళుతుంటారు. కానీ భారీ బడ్జెట్లో పెట్టి చేసిన చిన్న హీరోల సినిమాలకు గాలిలో దీపం లాగానే పరిస్థితి అని చెప్పాలి.. సినిమా బాగుంటే ఆయా సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తాయి లేదంటే నిర్మాత పని అంతే.. ఇటీవల కాలంలో వస్తున్న చిన్న హీరోల సినిమాలను పరిశీలిస్తే 100 కోట్ల సినిమాలే ఎక్కువగా వారివి వస్తున్నాయి.

Also Read: Sunil: మీకంటే ఆ హీరోనే బెటర్ అంటూ చిరంజీవి ముందే సునీల్ షాకింగ్ కామెంట్స్.?

ఏడాదిలో వంద సినిమాలు వస్తే వాటిలో ఒకటి, రెండు సినిమాలే ప్రేక్షకులను బాగా మెప్పించి కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నాయి. అటువంటి సమయాల్లో కొంతమంది మార్కెట్ ఉన్న సక్సెస్ లేని హీరోలు వారి సినిమాలను కోట్లల్లో చేస్తూ నిర్మాతలను రిస్కులో పెడుతున్నారు.ఇది నిర్మాతలకు పెద్ద భారం అవుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఫిలిం ఇండస్ట్రీ లో దీనిపై ఓ మీటింగ్ కూడా నిర్మాలు పెట్టబోతున్నారట. మరి ఆయా హీరోలు భవిష్యత్తులో సినిమాలను తక్కువ బడ్జెట్ లో చేస్తారా అనేది చూడాలి అన్నది చూడాలి.