Is Allu Arjun dream role

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో బిజీగా ఉన్నారు.. ఈయన పుష్ప-2 లో స్మగ్లర్ పాత్రలో కనిపించారు. అయితే అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో ఇప్పటివరకు చాలామందికి తెలియదు.. మరి ఆయనకు ఉన్న డ్రీమ్ రోల్ ఏంటి.. ఆ డ్రీమ్ రోల్ ఫుల్ ఫిల్ చేయగల డైరెక్టర్ ఎవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ మొదటి సినిమాతో ట్రోల్స్ అందుకున్నప్పటికీ సినిమా మాత్రం హిట్ అయింది.

Is Allu Arjun dream role

ఆ తర్వాత వచ్చిన ఆర్య బన్నీకి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చి పెట్టింది. అలా ఈయన చేసిన వరుస సినిమాలు హిట్ కొట్టాయి. ఇక ఈయన సినీ కెరియర్లో జులాయి, దేశముదురు, హ్యాపీ,సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, ఎవడు,దువ్వాడ జగన్నాథం,సరైనోడు, అలవైకుంటపురంలో వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై అల్లు అర్జున్ రేంజ్ ఏంటో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది.(Allu Arjun)

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన వ్యక్తి.. ఎవరంటే..?

పుష్ప సినిమాలో ఈయన నటించిన తీరును మెచ్చి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అల్లు అర్జున్ కి లభించింది.అయితే ఇప్పటివరకు ఈ అవార్డును సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండి ఎవరు కూడా అందుకోలేదు.అలాంటిది మొట్ట మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ నుండి బన్నీకి అవార్డు రావడం ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ అవార్డుతో అల్లు అర్జున్ స్టార్డం ఎక్కడికో వెళ్లిపోయింది.అయితే అలాంటి అల్లు అర్జున్ కి డ్రీమ్ రోల్ ఏంటంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో చేయడమట.

Is Allu Arjun dream role

అవును మీరు వినేది నిజమే. అల్లు అర్జున్ కి పూర్తిస్థాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేయడం అనేదే డ్రీమ్ రోల్ అట. అయితే రేసుగుర్రం సినిమాలో క్లైమాక్స్ చివర్లో కొద్దిసేపు పోలీస్ పాత్రలో నటిస్తారు కానీ అది ఫుల్ లెన్త్ పాత్ర కాదు.కానీ అల్లు అర్జున్ కి మాత్రం పూర్తిస్థాయిలో ఉండే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేయడం డ్రీమ్ రోల్ అని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ కళ నెరవేరలేదు. మరి అల్లు అర్జున్ ని పూర్తిస్థాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించే దర్శకుడు ఎవరో చూడాలి.(Allu Arjun)