.. Tomato: ప్రతి ఒక్కరికి విరిగా దొరికే కూరగాయల్లో టమాటా ఒకటి. ఇది చాలా తక్కువగా దొరుకుతాయి. కొన్ని సందర్భాలలో మాత్రమే వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు మనం చేసే వంటకాలలో తప్పకుండా ఒకటి రెండు టమాటాలను తప్పకుండా వేస్తాం. చికెన్, మటన్ లో కూడా టమాటాలను వేయకుండా అస్సలు వండలేరు. దానివల్ల కూరలో రుచి బాగుంటుంది. అయితే టమాటాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. Tomato

Tomato Health Benefits

అంతేకాకుండా చర్మానికి కూడా టమాటాలు ఎంతో మంచివని వైద్య నివేదికలో వెళ్లడైంది. టమాటాలలో విటమిన్ సి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. టమాటాలు పుల్లగా ఉండటం వల్ల రుచి చాలా బాగుంటుంది. టమాటాలు తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు తొలగిపోతాయి. టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. టమాటాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తద్వారా గుండె సమస్యలు తొలగిపోతాయి. టమాటలో పొటాషియం, సోడియం ఉండడంవల్ల శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధుల నుంచి టమాటాలు పోరాడుతాయి. Tomato

Also Read: Mohammed Shami: టీమిండియాలోకి రాకుండా షమీపై కుట్రలు ?

టమాటా కూర తినడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తారు. ఇది రుచి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా టమాటా కూరని చాలా ఇష్టంగా తింటారు. ఇక వారంలో ఒక్కసారి అయినా టమాటా కూరను తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇక తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ఎక్కువగా తింటే టమాటాల వల్ల అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. వీటిలో పులుపుదనం ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు ఉన్నవారు అస్సలు తినకపోవడం మంచిది. ఇక మరి ముఖ్యంగా ఏదైనా ఆపరేషన్ అయిన వారు టమాటాను అస్సలు తినకూడదు. దానివల్ల శరీరం అంతా దురద ఏర్పడుతుంది. Tomato

ఇక టమాటాలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. టమాటాలను పేస్ట్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అంతేకాకుండా ముఖంపై మొటిమలు, మచ్చలు సులభంగా తొలగిపోతాయి. వారంలో ఒక్కసారైనా ముఖానికి టమాటా పేస్ట్ అప్లై చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. బయటికి వెళ్లి వేలలో డబ్బులను ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లోనే టమాటాలతో చాలా నేచురల్ గా అందంగా తయారవ్వచ్చని చెబుతున్నారు. Tomato