Final list of Bigg Boss 8.. These are the ones who will enter the house

Bigg Boss 8: బిగ్ బాస్ 8 కి రంగం సిద్ధమవుతోంది..ఈ హౌస్ లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్టు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే గత కొద్ది రోజుల నుండి బిగ్ బాస్ 8లోకి వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అంటూ ఎన్నో రూమర్స్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బిగ్ బాస్ 8 హౌస్ లోకి వెళ్లడానికి కంటెస్టెంట్స్ అందరూ ఫిక్సయ్యారని,హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో హౌస్ లోకి వెళ్ళబోయే సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Final list of Bigg Boss 8.. These are the ones who will enter the house

తెలుగులో బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుండి షో కి షో కి మధ్య ఆసక్తిని పెంచుతూ కొత్తకొత్త సెలబ్రిటీలను తీసుకువస్తూ షో టిఆర్పి రేటింగ్ కోసం ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు. అలా గత సీజన్ లో కామన్ మ్యాన్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి తీసుకువచ్చారు. కానీ కప్పు మాత్రం పల్లవి ప్రశాంత్ కి ఇవ్వరని కామన్ మ్యాన్ కి కప్పు రాదు అనే నెగిటివిటీని తోసి పుచ్చి చివరికి కప్పు ఇచ్చారు.(Bigg Boss 8)

Also Read: Kalki Part 2: కల్కిగా స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ షేకే.!

అలా బిగ్ బాస్ పై ఉన్న నెగెటివిటీ కూడా పోయింది. అయితే బిగ్ బాస్ 7 హిట్ అవ్వడంతో బిగ్ బాస్ 8 పై మేకర్స్ భారీ ప్లాన్ చేశారు.ఇప్పటికే సెప్టెంబర్ మొదటివారంలో లేదా సెప్టెంబర్ ఫస్ట్ కి ఈ రియాల్టీ షో స్టార్ట్ అయిపోతుంది.అయితే తాజాగా ఇందులోకి వెళ్లే ఫైనలిస్టు ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్టు వైరల్ అవుతుంది. అందులో ఎవరెవరు ఉన్నారంటే..

Final list of Bigg Boss 8.. These are the ones who will enter the house

కుమారి ఆంటీ, న్యూస్ రీడర్ కళ్యాణి,హాట్ యాంకర్ జబర్దస్త్ రీతు చౌదరి, అంజలి పావని, గాయత్రి గుప్తా, అనిల్ జీలా, నటి సన,ఊర్మిళా చౌహన్, అబ్బాస్, యాదమ్మ రాజు,నటుడు రోహిత్,యాంకర్ విద్య, బంచిక్ బబ్లు,ఇంద్రనీల్ ,రేఖ భోజ్,కిర్రాక్ ఆర్పి,సింగర్ సాకేత్, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర వంటి సెలెబ్రిటీల లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో కూడా ఎంతమంది హౌస్ లోకి ఫైనల్ గా వెళ్తారు అనేది క్లారిటీ లేదు.(Bigg Boss 8)