Naveen Polishetty secret marriage with a foreign girl

Naveen Polishetty: జాతి రత్నాలు మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరో హోదాలోకి వెళ్లిపోయారు నవీన్ పోలిశెట్టి.. ఈ సినిమాలో ఆయన కామెడీకి చాలామంది ఫిదా అయిపోయారు. ఇక జాతి రత్నాలు మూవీ ఇప్పుడు టెలివిజన్లో వచ్చినా కూడా చాలామంది కుటుంబ కథా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. అంత నవ్వులు పుట్టించే సినిమా ఇది.అయితే అలాంటి ఈ సినిమా తర్వాత సీనియర్ హీరోయిన్ అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించారు. ఈ మూవీ కూడా హిట్ టాక్ వచ్చింది.

Naveen Polishetty secret marriage with a foreign girl

అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఎలాంటి ప్రాజెక్టును నవీన్ పోలిశెట్టి అనౌన్స్ చేయలేదు. అంతే కాదు ఈ సినిమా తర్వాత ఆయన అసలు ఇండియాలోనే లేరు. ఆయన పూర్తిగా అమెరికాలోనే ఉంటున్నారు. రీసెంట్ గానే యాక్సిడెంట్ అయింది అనే విషయాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా తన చేతికి కట్టు కట్టుకొని ఉన్న వీడియోలు ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.అలాగే యాక్సిడెంట్ అయినా కూడా తన చేతికి కట్టు కట్టుకునే ఓ ఫన్నీ వీడియో షేర్ చేసుకొని అభిమానులను నవ్వించారు. (Naveen Polishetty)

Also Read: Raviteja: ఆ హీరోయిన్ కారణంగా రవితేజ పూరి మధ్య గొడవలు.. శనిలా దాపురించిందంటూ..?

అయితే ఆ వీడియో అభిమానులతో పంచుకున్న కొద్దిసేపటికి ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈయన మళ్లీ అమెరికా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నవీన్ పోలిశెట్టి గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..నవీన్ పోలిశెట్టి విదేశీ అమ్మాయిని అంటే అమెరికాకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లాడారని,అందుకే ఆయన అమెరికాలో ఉంటున్నాడని ఒక్కసారిగా ఈ రూమర్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Naveen Polishetty secret marriage with a foreign girl

అయితే ఇదే విషయంపై కొంతమంది మీడియా వాళ్ళు నవీన్ పొలిశెట్టిని ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్న నా పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తవం. నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను. ఇప్పుడు నేను నా సినిమాల పైనే పూర్తి దృష్టి పెట్టాను.ఇక పెళ్లి చేసుకునే ముందు మీడియాకే తెలియజేస్తాను. ప్రస్తుతం మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి..అంటూ తన పెళ్లి వార్తలను ఖండించారు.కానీ సోషల్ మీడియాలో మాత్రం నవీన్ పోలిశెట్టి విదేశీ అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు జోరందుకున్నాయి.(Naveen Polishetty)