Sania Mirza: సౌత్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి..?

Sania Mirza: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సానియా మీర్జా రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రముఖ క్రికెటర్ సోయాబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు ఆనందంగా సంసారాన్ని గడిపి ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. అలాంటి జంట ఎవరి దారి వారు చూసుకున్నారు. వీరు విడిపోయిన తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి అయినటువంటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.

Sania Mirza second marriage with South Hero

Sania Mirza second marriage with South Hero

ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పటినుంచి చాలామంది సానియా మీర్జాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీరు కూడా పెళ్లి చేసుకోండి మేడం అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. విడిపోగానే జీవితం ఆగిపోదు ముందుకు వెళ్తే ఎన్నో దారులు దొరుకుతాయి అంటూ మాట్లాడుతున్నారు.. ఇక ఈ క్రమంలోనే సానియా మీర్జా గురించి పాకిస్తాన్ యాక్టర్ నవీన్ జాఫర్ ఒక న్యూస్ ప్రోగ్రాంలో పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. (Sania Mirza)

Also Read: Game Changer and Daku Maharaj: గేమ్ ఛేంజర్, దాకు మహారాజ్ టికెట్ల విషయంలో హైకోర్టు సీరియస్.. వెనక్కి తగ్గిన నిర్మాతలు!!

విడాకులు అంటే జీవితం అయిపోయిందని కాదు ఇది దురదృష్టకర సంఘటన అయినప్పటికీ ఆ తర్వాఎవరి జీవితం చీకటిమయం కాకూడదు. సానియాకు ఎవరైనా నచ్చితే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని సజెషన్ ఇచ్చారు. ఆ విధంగానే సానియా ప్రస్తుతం రెండో పెళ్ళికి రెడీ అయిందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె చేసుకోబోయే అబ్బాయి ఎవరయ్యా అంటే తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరో అని తెలుస్తోంది. ఆయన పేరు బయటకు రానప్పటికీ వారి మధ్య చాలా కాలం నుంచి రిలేషన్ ఉందట.

Sania Mirza second marriage with South Hero

ఇది కాస్త పెళ్లికి దారి తీసినట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ నెట్టింటా మాత్రం ఈ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై సానియా మీర్జా ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వార్త పుకారుగా మిగిలిపోతుందా లేదంటే, సానియా మీర్జాకు తెలుగు హీరో ఎవరైనా జోడి అవుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది. అంతేకాకుండా సానియా మీర్జా ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమితో కూడా రిలేషన్ లో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి కానీ చివరికి అది పుకారుగానే మిగిలిపోయింది.(Sania Mirza)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *