
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్, ప్రీతి జింతా జోడీగా నటించిన batwara movie బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పూర్తిగా డీలా పడిపోయింది. ఇమ్రాన్ హష్మీ నటించిన ‘అవారాపన్ 2’ సినిమాతో బాక్సాఫీస్ రేసులో పోటీ పడిన ఈ మూవీ, ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో ఫెయిల్ అయింది. సెకండ్ మండೇ టెస్టులోనూ ఈ సినిమా ఘోరంగా విఫలమైంది.
Box Office Report Of Batwara
తాజా బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఇండియాలో కనీసం రూ. 40 కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేయలేకపోయింది. సినిమా రన్ దాదాపు ముగింపు దశకు చేరినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అయితే, ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకుని ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ. 51 కోట్ల గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది. శుక్రవారం నాటికి కేవలం రూ. 75 లక్షల రేంజ్‌లోనే కలెక్షన్లు రాబట్టడంతో ట్రేడ్ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
మరోవైపు, ఇదే సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్ 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఆ సినిమాతో పోలిస్తే సన్నీ డియోల్ చిత్రం కలెక్షన్లు చాలా డీలా పడ్డాయి. ఫస్ట్ వీక్ తర్వాత ఈ మూవీకి థియేటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిపోయింది. వీకెండ్స్‌లో కూడా ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిలేలా కనిపిస్తోంది.
మొత్తానికి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. డియోల్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం మేకర్స్‌కు నిరాశనే మిగిల్చింది. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
👉 ఇంకా చదవండి: Chandrababu Naidu: ఏపీకి మోదీ భారీ గిఫ్ట్.. సాధించిన చంద్రబాబు!!
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





