Game Changer: ఈ 10 కారణాల కోసమైనా గేమ్ ఛేంజర్ ని చూడాల్సిందే.?
Game Changer: భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ మూవీ ఎట్టకేలకు జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా జనవరి 9 అర్ధరాత్రి బెనిఫిట్ షోలు పడిపోయాయి. తెలంగాణలో తప్ప ఏపీలో ఈ బెనిఫిట్ షో హడావిడి కొనసాగింది. అయితే ఈ సినిమా చూసేసిన ప్రేక్షకులు మిక్స్డ్ రివ్యూలు ఇవ్వడంతో అసలు సినిమాను చూడాలా వద్ద అనే డైలమాలో పడ్డారు కొంతమంది మెగా ఫ్యాన్స్.అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఈ పది కారణాల కోసం అయినా చూడాలి అంటూ సినిమా చూసి వచ్చిన వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు.మరి ఇంతకీ గేమ్ చేంజర్ సినిమా చూసేయ్యడానికి ఆ 10 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
You have to watch Game Changer for these 10 reasons
- రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది.ఎందుకంటే వినయ విధేయ రామ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీలో నటించారు.ఇది మల్టీ స్టారర్ సినిమా.. అందుకే రాంచరణ్ సోలో హీరోగా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సోలోగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాని చూడ్డానికి మొదటి కారణం అని చెప్పవచ్చు.
- స్టార్ డైరెక్టర్ శంకర్ జెంటిల్ మెన్ మూవీ చూశాక చాలామంది తెలుగు నిర్మాతలు ఈయనతో సినిమా చేయాలి అనుకున్నారు. కానీ 31 ఏళ్ల తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ తో ఆయన తెలుగు డెబ్యూ మూవీ చేశారు.
- గేమ్ ఛేంజర్ సినిమాలో విలన్ పాత్ర లో నటించిన ఎస్ జె సూర్య నట విశ్వరూపం చూడ్డానికైనా ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే నాని హీరోగా చేసిన సరిపోదా శనివారం సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా చేశారు. కానీ ఈ సినిమాలో హీరో కంటే విలన్ కే మంచి గుర్తింపు లభించింది.అందుకే గేమ్ చేంజర్ లో సూర్య నటన చూడ్డానికి కచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే.(Game Changer)
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ ప్లస్ లు మైనస్ లు .. సినిమాలో ఆ ఒక్క సీనే కీలకమా.?
- గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు.ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న పాత్రలో రామ్ చరణ్ లుక్ చాలా బాగుంది. అయితే ఈ పాత్రలో రామ్ చరణ్ మంచి ఎమోషన్స్ పండించారు. ఈ పాత్రలో నటించిన రామ్ చరణ్ యాక్టింగ్ చూడడానికైనా సినిమా చూడాల్సిందే.
- బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని వినయ విధేయ రామ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ బ్యూటీ గేమ్ ఛేంజర్ వచ్చింది. ఈ హీరోయిన్ యాక్టింగ్ కోసమైనా సినిమా చూడాల్సిందే.
- ఈ సినిమా కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది హీరోయిన్ అంజలి.ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ అప్పన్న పాత్రకి జోడిగా పార్వతి పాత్రలో అంజలి నటించింది.ఈ సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో అంజలి అదరగొట్టేసింది.ఈమె నట విశ్వరూపం చూడడానికైనా సినిమా చూడాలి.
- తమన్ గేమ్ ఛేంజర్ మూవీ కి మంచి బిజిఎం ఇచ్చారని ఇప్పటికే సినిమా చూసిన నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. ఇక తమన్ బిజిఎం సినిమాకి ఏ విధంగా ప్లస్ అయిందో చూడ్డానికి సినిమా చూడాలి.
- గేమ్ ఛేంజర్ మూవీకి నిర్మాతగా చేసిన దిల్ రాజు 50 వ సినిమా ఇది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు. మరి దిల్ రాజు 50 వ సినిమా ఎలా ఉందో ఆయనకు ఎలాంటి లాభాలు తీసుకొస్తుందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
- రామ్ చరణ్ హెలికాప్టర్ నుండి కత్తి పట్టుకొని దిగే సన్నివేశం మనం ట్రైలర్ లో చూసాం.అయితే ఈ సీన్ మాస్ కి అమ్మా మొగుడిలా ఉంది.రామ్ చరణ్ కి సంబంధించిన ఇంట్రో సీన్ చూడడానికైనా సినిమా చూడాల్సిందే.
- చివరిగా శ్రీకాంత్ యాక్టింగ్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంది. బొబ్బిలి సత్యమూర్తి పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టేశారు.
ఇలా ఈ 10 కారణాల కోసమైనా గేమ్ ఛేంజర్ చూడాల్సిందే అంటున్నారు సినిమా చూసిన జనాలు.(Game Changer)