Game Changer: జగన్ ని టార్గెట్ చేసిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ లో ఆ డైలాగ్.?

Game Changer: మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో ప్రదర్శింపబడింది. గత కొన్ని నెలల నుంచి మెగా అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న ఈ మూవీ థియేటర్ లోకి రాగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా చూడటానికి ఇప్పటికే థియేటర్లలో జనాలు బారులు తీరారు. మొదటి షోలన్నీ పడిపోయాయి. సినిమా చూసిన వారంతా బయటకు వచ్చి పెద్ద ఎత్తున రివ్యూలు ఇస్తున్నారు.

 Jagan dialogue in Game Changer

Jagan dialogue in Game Changer

ముఖ్యంగా సినిమా సూపర్ హిట్టు, బ్లాక్ బాస్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో ఈ సినిమాలో జగన్ ను ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ ఉందని భావిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ ను టార్గెట్ చేస్తూనే ఈ డైలాగ్ రాశారు అంటూ చెప్పుకోస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో నటిస్తారు. (Game Changer)

Also Read: Game Changer: ఈ 10 కారణాల కోసమైనా గేమ్ ఛేంజర్ ని చూడాల్సిందే.?

ఇందులో ముఖ్యమంత్రిగా ఎస్ జె సూర్య విలన్ పాత్ర అద్భుతంగా పోషించారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ మరియు ఎస్.జె సూర్య మధ్య కొన్ని సన్నివేశాలు డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇందులో ఎస్ జె సూర్య పాత్ర పేరు మోపిదేవి. గేమ్ చేంజర్ మూవీలో ఎస్ జె సూర్య 30 ఏళ్ల వరకు నేనే సీఎం అంటూ కలలు కంటూ ఉంటారు.

Jagan dialogue in Game Changer

ఈ విధంగా సినిమాల్లో ఆయన ఏ విధంగా కలలు కన్నారో జగన్ కూడా పదేపదే సభలు పెట్టిన సమయంలో 30 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చేవారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఈ డైలాగ్ రాసుకోచ్చారని కొంతమంది ట్విట్టర్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే మొదటి భాగం అంతగా ఆకట్టుకోకపోయినా సెకండాఫ్ చాలా అద్భుతంగా ఉందని రివ్యూలు ఇస్తున్నారు.(Game Changer)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *