Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ లో ఇది గమనించారా.. చిరంజీవి చంద్రబాబులను దించుతూ..?
Game Changer: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రానికి ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు రామ్ చరణ్ తన కెరియర్ లో ఏనాడు చేయనటువంటి వెరైటీ పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. అలాంటి గేమ్ చేంజర్ జనవరి 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు పడిపోయాయి.
Did you notice this in the Game Changer movie
సినిమాలు చూసిన వారంతా ఎక్కువ వరకు పాజిటివ్ రివ్యూలనే ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలన్నింటిని కలగలుపుకొని తీసారని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా చిరంజీవిని కూడా అనుకరించేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, అలాగే చంద్రబాబుకు సపోర్ట్ చేసేలా మరికొన్ని పాత్రలు డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరి ఇందులో వారిద్దరిని ఏ విధంగా వాడుకున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దామా.. (Game Changer)
Also Read: Game Changer: ఈ 10 కారణాల కోసమైనా గేమ్ ఛేంజర్ ని చూడాల్సిందే.?
రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఇందులో తన తండ్రి చిరంజీవి పొలిటికల్ పార్టీ తలపించేలా ఒక సన్నివేశం ఉంటుంది. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి దాన్ని నడపలేక చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే గేమ్ చేంజర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పార్టీని గుర్తు చేసేలా ప్రజా అనే పేరుతో ఒక రాజకీయ పార్టీ ఈ సినిమాలో కనిపిస్తుంది. దీన్ని చూసి తన తండ్రిని గుర్తు చేసుకోవడానికే ఇలా ప్రజా అనే పార్టీ పేరు పెట్టారని అంటున్నారు.
ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ గుర్తును గుర్తుచేసేలా ఒక పాత్ర ఉంది. రామ్ చరణ్ అప్పన్న పాత్రలో నటించే టైంలో ఎక్కువగా సైకిల్ తొక్కే సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీ గుర్తు సైకిల్ కాబట్టి, తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో భాగమయ్యారు కాబట్టి సైకిల్ గుర్తుని కూడా హైలెట్ చేసేలా చూపించారు. ఈ విధంగా గేమ్ చేజర్ మూవీలో రెండు రాజకీయ పార్టీలను వాడేసుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని చెప్పవచ్చు.(Game Changer)