
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు పెద్ద టెన్షన్‌గా మారాయి. ముఖ్యంగా సీఎం Revanth Reddy వ్యవశైలి, రాష్ట్రంలో పార్టీ లీడర్ల మధ్య పీక్స్‌కి వెళ్తున్న గొడవలు నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో ఒకవైపు పాలన సాగుతున్నా, మరోవైపు లీడర్ల మధ్య సమన్వయం లోపించడం కాంగ్రెస్ హైకమాండ్‌కు తీవ్ర తలనొప్పి తెచ్చిపెడుతోంది.
Revanth Reddy Issues Create Tension
గ్రూప్ రాజకీయాలు, లీడర్ల మధ్య గ్యాప్ కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఆందోళన హైకమాండ్‌లో మొదలైంది. రాహుల్ గాంధీ స్వయంగా ఈ ఇష్యూస్‌పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా లీడర్లు వ్యవహరిస్తుండటంతో క్యాడర్‌లో కన్ఫ్యూజన్ క్లియర్‌గా కనిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ కొద్ది రోజులుగా పార్టీలో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. సీనియర్లు, జూనియర్ల మధ్య పవర్ పాలిటిక్స్ ముదరడంతో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. ఈ లొల్లిని ఇక్కడితో ఆపకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి బిగ్ ప్రాబ్లం అవుతుందని హైకమాండ్ భావిస్తోంది.
ఈ టెన్షన్ పరిస్థితులపై త్వరలోనే ఢిల్లీ నుంచి పెద్దలు రంగంలోకి దిగి పర్సనల్‌గా క్లారిటీ ఇస్తారని సమాచారం. సీఎం Revanth Reddyతో పాటు కీలక లీడర్లను ఢిల్లీకి పిలిపించి సీరియస్‌గా మాట్లాడే ఛాన్స్ ఉంది. మరి ఈ ఇంటర్నల్ ఇష్యూస్ కి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
👉 ఇంకా చదవండి: MojtabaKhamenei: ముస్లిం దేశాల ఐక్యతపై వ్యూహాత్మక పిలుపు







