Pawan Kalyan: వివాదంలో పవన్‌ కళ్యాణ్‌..2 నిమిషాల టైం కూడా ఇవ్వలేదట ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రూల్స్ చెప్తారు.. కాని పాటించరంటూ సోషల్ మీడియా నిలదీస్తున్నారు నెటిజన్లు. గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఈవెంట్‌ కు వచ్చి.. ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి… వారికి ఆర్థిక సాయం కూడా చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి మరీ..పరిశీలించారు పవన్‌ కళ్యాణ్‌.

Pawan Kalyan in Controversy over game changer

అయితే.. ఈ తరుణంలోనే…పవన్ కళ్యాణ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారంటూ.. అల్లు అర్జున్ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇరుక్కున్నారని కామెంట్లు వస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే.. బన్నీ లేదా అతని టీమ్ స్పందించి ఉంటే బాగుండేదంటూ సూక్తులు చెప్పారు పవన్‌. కానీ.. మేటర్ తనదాకా వచ్చేసరికి, తాను చెప్పిన మాటల్నే తుంగలో తొక్కేశారట పవన్ కళ్యాణ్.

‘గేమ్ ఛేంజర్’ ప్రమాద బాధిత కుటుంబాల్ని ఇంటికి పిలిచి మరీ అవమానించారట. పరామర్శకు పిలిచి.. కనీసం మాట్లాడకుండానే వెళ్లిపోయారట పవన్ కళ్యాణ్. దీంతో.. బన్నీకో న్యాయం, నీకో న్యాయమా పవన్? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. మేము డబ్బులివ్వమనలేదు.. కోట్లు అడగలేదని…సరిగ్గా పలకరిస్తే చాలని పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చామన్నారు గేమ్ ఛేంజర్ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు. తీరా వచ్చాక.. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు… ఈ మాత్రం దానికి ఎందుకు పిలిపించారు?
కనీసం రెండు నిమిషాల టైమ్ కూడా ఇవ్వలేరా? అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *