Neem: నేటి కాలంలో చాలామంది చర్మ సౌందర్యానికి అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారు. చర్మానికి చిన్న సమస్య వచ్చినా…. ఒక్క చిన్న మొటిమలు వచ్చిన అస్సలు ఊరుకోరు. ఏవేవో వాడుతూ వాటిని వదిలించుకునే వరకు ఆరాటపడుతూ ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. చర్మంపై దురద, దద్దుర్లు, మొటిమలు విపరీతంగా వస్తాయి. అయితే వాటిని తగ్గించుకోవడానికి వేప ఆకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. Neem

There are many benefits of eating neem leaves in rainy season

ఇందుకోసం కొన్ని ఆకులను ఒక లీటర్ నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మానికి సంబంధించిన అనేక రకాల ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేప ఆకు ఒక వరం అని చెప్పవచ్చు. ఈ వేప ఆకును ఒకటి లేదా రెండు ప్రతిరోజు ఉదయం పూట తిన్నట్లయితే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తొలగించి మధుమేహం క్రమక్రమంగా తగ్గుతుంది. Neem

Also Read:

ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. వీటిని ప్రతిరోజు తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగుల సమస్య తొలగి పోతుంది. ఇక వేప ఆకులకు జీర్ణ సమస్యలను తొలగించే స్వభావం ఉంది. చాలామంది కలుషితమైన వాతావరణం కారణంగా మొటిమల సమస్యలతో బాధపడతారు. అలాంటివారు వేపాకులను పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు కలుపుకొని ముఖానికి అప్లై చేసినట్లయితే ఒకేరోజులో సమస్య తొలగిపోతుంది. Neem

జ్వరం, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వచ్చిన సమయంలో వేడి నీటిలో వేపాకులను వేసి మరిగించి వాటిని ఆవిరి పట్టినట్లయితే జ్వరం వంటి సమస్యలు సులభంగా తొలగిపోతాయి. వేపాకు చర్మ సౌందర్యానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Neem