Halim Seeds:హలీం గింజలు తింటే…ఆ సమస్యలకు చెక్?
Halim Seeds: హలీం గింజలు ప్రతి ఒక్కరికి తెలుసు. వీటిని అనేక రకాల ఔషధాలు తయారీలో వాడతారు. హలీం గింజలు తింటే శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ గింజలను తరుచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. హలీమ్ గింజలతో శ్వాస కోస సమస్యలు దూరం అవుతాయి. అలసట, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.
Benefits of Halim seeds
ఆయుర్వేదంలో హలీమ్ గింజలను చాలా రకాలుగా వాడుతారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నివారించే మందులలో ఉపయోగిస్తారు. వీటిలో ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి మెదడు పనితీరు సక్రమంగా పనిచేయడానికి హలీం గింజలను ఉపయోగిస్తారు.
రక్తహీనత సమస్య ఉన్నవారు వీటిని తింటే ఆ సమస్యలు అతి తక్కువ సమయంలోనే కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. హలీమ్ గింజల్లో లైసెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కణజాలాలు ఆరోగ్యంగా ఉండడానికి కణాలు ఉత్పత్తికి సహాయపడుతుంది. హలీమ్ గింజలను తింటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇవి శరీరంలోని ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి జుట్టు రాలడం పూర్తిగా మానుతుంది.