Anshu Ambani: వాటి సైజులు పెంచాలి.. నాగార్జున హీరోయిన్ పై డైరెక్టర్ అసభ్య కామెంట్స్.?
Anshu Ambani: అన్షూ అంబానీ అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయిన్.. ఈమె నాగార్జున హీరోగా చేసిన మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఫ్లాష్ బ్యాక్ లో అన్షు అంబానీ నాగార్జున ప్రేమించిన అమ్మాయిగా కనిపిస్తుంది. అయితే యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ విషయం తెలియని నాగార్జున తనని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని భావించి అమ్మాయిలు అంటేనే అసహ్యం పెంచుకుంటాడు. అయితే ఈ సినిమాలో అన్షూ అంబానీ తన లుక్ తో ఎంతోమందిని ఫిదా చేసింది.
Director vulgar comments on Anshu Ambani
అయితే ఈ సినిమా తర్వాత ఎక్కువగా సినిమాల్లో యాక్టివ్గా లేని ముద్దుగుమ్మ.. చాలా రోజుల నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ మళ్ళీ ఇన్ని రోజులకు మజాకా మూవీ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన మజాకా మూవీలో సందీప్ కిషన్ హీరో గా.. సందీప్ కిషన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటించారు.ఇక రావు రమేష్ కి జోడిగా అన్షూ అంబానీ నటించింది. (Anshu Ambani)
Also Read: Daku Maharaj: డాకు మహారాజ్ లో నటించిన చిన్నారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?
ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్..అయితే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో డైరెక్టర్ త్రినాధరావు నక్కిన అన్షు పై అసభ్యకర కామెంట్లు చేశారు. అయితే అన్షు చాలా సన్నగా ఉండడంతో ఆయన ఈవెంట్లో మాట్లాడుతూ.. ఒకప్పుడు మన్మధుడు సినిమాలో హీరోయిన్ అన్షుని చూడడానికే నేను థియేటర్ లోకి వెళ్లే వాడిని.ఆమె బొద్దుగా లడ్డులా ఉండేది.ఆమె అందానికి నేను ఫిదా అయ్యాను. కానీ ఇప్పుడు చూస్తే ఆమె చాలా మారిపోయింది.
చాలా సన్నబడింది. అయితే తెలుగు సినిమాల్లో నటించాలంటే కాస్త లావుగా ఉండాలి. తెలుగుకి సన్నగా ఉంటే సరిపోదు. కాస్త తిని లావవ్వు..అన్ని సైజులు పెంచాలి అంటూ స్టేజ్ పైనే అసభ్యకర కామెంట్లు చేశారు డైరెక్టర్ త్రినాధరావు. ఇక ఈయన కామెంట్లపై చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు. డైరెక్టర్ అయ్యుండి హీరోయిన్ల గురించి ఇలానేనా మాట్లాడేది.. కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.(Anshu Ambani)