Shravana Masam: శ్రావణమాసం ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా శ్రావణమాసం వచ్చిందంటే మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. కనీసం నెలరోజుల పాటు ఇంట్లో ఎలాంటి మాంసాన్ని తినకుండా ఉండడం మన సాంప్రదాయం. పూర్వకాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. కానీ దీని వెనుక అసలు కారణం ఏమిటో చాలామందికి తెలియదు…. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Shravana Masam
Is eating meat in the month of Shravana Masam dangerous
వర్షాకాలం ప్రధానంగా జలచరాలకు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో చేపలను పట్టుకొని తింటే, అది జల చరాల పునరుత్పత్తికి ఆటకం కలుగుతోంది. అంతేకాకుండా చేపల సంఖ్య తగ్గుతుంది. ఆ కారణం చేత ఈ సమయంలో చేపలతో సహా ఎక్కువగా మాంసం తినరు. వర్షాకాలంలో నీరు చాలావరకు కలుషితమవుతుంది. ఇక ఆ నీటిలో చేపలు ఉంటాయి. దానివల్ల అనేక రకాల వ్యాధులకు గురవుతాయి. ఆ చేపలు తిన్నట్లయితే అనేక రకాల వ్యాధులు మనకు వస్తాయి. Shravana Masam
Also Read: Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. ఆ ఏడుగురు ఔట్.. ?
కాబట్టి వర్షాకాలంలో శాఖాహారమే ఆరోగ్యానికి చాలా రక్షణ అని పెద్దలు చెప్పడం జరిగింది. శ్రావణమాసంలో వర్షాకాలం ముగియకపోవడం వల్ల ఎండలు లేకపోవడం దీనికి మరో ముఖ్య కారణం. చాలా వరకు వెలుతురు ఉండదు. అందువల్ల మన శరీరంలో జీర్ణక్రియ వేగంగా జరగదు. ఇందులో ఎక్కువగా మాంసాహారం తిన్నట్లయితే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అది జీర్ణం కాకపోతే కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. Shravana Masam
అందువల్లనే వర్షాకాలంలో ఒక నెల రోజులపాటు మాంసాహారం తినకుండా శ్రావణమాసం చేస్తారు. ఇక వర్షాకాలంలో కోళ్లకు కూడా అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు వచ్చిన చికెన్ తిన్నట్లయితే…. డెంగ్యూ వంటి అనేక రకాల విష జ్వరాలు వస్తాయి. అందువల్లనే ఒక నెలరోజుల పాటు ఎలాంటి మాంసం తినకుండా శాఖాహారం తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. వీలైతే ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. Shravana Masam