Nayanthara: నయనతారకు బాగా పొగరు.. క్షమించమని కూడా అడగలేదు.?
Nayanthara: నయనతార సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్ లు కూడా ఎక్కువగా చేస్తుంది. అలా ఈమె గత ఏడాది ఫెమి9 సానిటరీ నాప్కిన్ అనే సంస్థని స్థాపించింది.అయితే ఈ సంస్థ స్థాపించి ఏడాది గడవడంతో దీనికి సంబంధించిన ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా నయనతార విగ్నేష్ శివన్ లు వచ్చారు.అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన నయనతారపై కొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు.. కనీసం క్షమించమని కూడా కోరలేదు..
Nayanthara didnot even ask for forgiveness
ఆమెకు ఎంత పొగరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ నయనతార చేసిన తప్పేంటి అనేది చూస్తే నయనతార ఫెమి9 శానిటరీ నాప్కిన్ సంస్థ వాళ్ళు చేసిన ఈవెంట్ కి తొమ్మిది గంటలకు వస్తానని చెప్పి ఒకటింటికి వచ్చిందట. అయితే ఈ ఈవెంట్ కి ముందుగానే ఇన్ ఫ్లూయెన్సర్ లని ఆహ్వానించింది నయనతార.కానీ తాను మాత్రం 9కి వస్తానని 1గంటలకి రావడంతో అక్కడికి వచ్చిన ఇన్ఫ్లు యెన్సర్ లు తీవ్రంగా నిరాశ పడ్డారట.(Nayanthara)
Also Read: Anshu Ambani: వాటి సైజులు పెంచాలి.. నాగార్జున హీరోయిన్ పై డైరెక్టర్ అసభ్య కామెంట్స్.?
అంతేకాదు ఒకటింటికి పూర్తవ్వాల్సిన కార్యక్రమం అదే టైంకి స్టార్ట్ అయ్యి ఆరు గంటలకు పూర్తయింది. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన ఇన్ఫ్లూయెసర్లు ఈవెంట్ 1 గంటలకే పూర్తవుతుంది కదా అని ముందుగానే టికెట్ బుక్ చేసి పెట్టుకున్నారట. కానీ నయనతార లేట్ గా రావడంతో ఆ ఈవెంట్ అయిపోయేసరికి 6అయ్యింది. దాంతో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు బస్సులు, ట్రైన్లు మిస్ అయ్యారట.అయితే ఈ విషయంలో ఇన్ఫ్లు యెన్సర్లు నయనతార పై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇక నయనతార చూపించిన ఆటిట్యూడ్ పై తమిళ మీడియా ఫైర్ అవుతోంది. నయనతారకు అంత పొగరు ఉండకూడదు.లేటుగా వచ్చి కనీసం అంతసేపు వెయిట్ చేసిన వాళ్లను క్షమించమని కూడా కోరలేదు.పైగా ఈవెంట్ కి వచ్చి హడావిడి చేసింది. మరీ అంత పొగరు ఉండకూడదు అంటూ విమర్శిస్తున్నారు. అయితే వీటిని పట్టించుకోని నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రేమ చాలు మా ఫెమి9 కుటుంబం చాలా పెద్దదవుతుంది అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కింద కూడా చాలామంది నయనతారకి కౌంటర్లు ఇస్తున్నారు.(Nayanthara)