Kejriwal voter list: ఢిల్లీలో ఎస్ఐఆర్ ప్రకంపనలు.. కేజ్రీవాల్ కుటుంబానికి నోటీసులు!!

arvind-kejriwal-voterlist-controversy-in-delhi-sir

ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేరు ‘unmapped’ కేటగరీలో నమోదైనట్లు ఆయన పార్టీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు.

ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 33.1 లక్షల మంది ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసులు అందినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు.

సీఎం రేఖా గుప్తాకు వయసు నమోదులో వ్యత్యాసం కారణంగా నోటీసు అందినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఇది జాబితా నుంచి తొలగింపు కాదని, కేవలం వివరాల్లో నమోదైన వ్యత్యాసాలను సరిచేసుకునేందుకు జారీ చేసిన నోటీసు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.

కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి వివరాలు సరిచేసుకోవాలి ఎన్నికల సంఘం సూచించింది. ఈ వివాదం ఢిల్లీ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

👉 ఇంకా చదవండి: Chandrababu Naidu: అయోధ్యలో భూమి కేటాయించాలని కోరిన సీఎం!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_