Sankrantiki Vasthunnam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ.. అదే పెద్ద మైనస్..?
Sankrantiki Vasthunnam Review: హీరో వెంకటేష్ ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చే సినిమా సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ అనిల్ రావిపూడి అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించి జనాల్లో మంచి బజ్ వచ్చేలా చేశారు. అలాంటి ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలామంది రివ్యూవర్స్ ట్విట్టర్ ద్వారా సినిమాపై రివ్యూ ఇస్తున్నారు. ]మరి సినిమా ఎలా ఉంది ఆ వివరాలు ఏంటో చూద్దామా..
Sankrantiki Vasthunnam Review
ది గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తే ఆయన సరసాన కథానాయికలుగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి చేశారు. అద్భుతమైన కామెడీతో వచ్చినటువంటి ఈ సినిమా ప్రస్తుతం డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలను వెనక్కి నెడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని, 144 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం ఎక్కడ కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది.(Sankrantiki Vasthunnam Review)
Also Read: Aishwarya Rajesh: జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న ఐశ్వర్య రాజేష్.. ఎందుకంటే.?
ఇక మూవీ కథ విషయానికి వస్తే ఇందులో వెంకటేష్ వైడి రాజు పాత్రలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్న వైడి రాజును ఒక పని కోసం పిలిపిస్తారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కథ సాగుతూనే అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తాడు వెంకటేష్.
ఇక ఎంత కామెడీ ఉన్నా కానీ, కథ మాత్రం కాస్త రొటీన్ స్టోరీ లాగే కనిపిస్తుంది కొన్ని కొన్ని సమయాల్లో ఇరిటేషన్ కూడా వస్తుంది. ఇక మొదటి పార్ట్ లో కళ్ళు తిప్పుకోకుండా చేసిన ఈ చిత్రం రెండో పార్ట్ విషయానికి వస్తే తేలిపోయిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అవుతుందని ట్విట్టర్ వేదికగా రివ్యూవర్లు రివ్యూలు ఇస్తున్నారు.(Sankrantiki Vasthunnam Review)