Anil Ravipudi: డైరెక్టర్ శంకర్ పరువు తీసేసిన అనిల్ రావిపూడి..?
Anil Ravipudi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన డైరెక్షన్ లో సినిమా వచ్చింది అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా ఉంటుంది. ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకోవడంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అలాంటి అనిల్ రావిపూడి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ పొజిషన్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అలాంటి ఈయన పటాస్ అనే సినిమా ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం ద్వారా తన మార్కును కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
Director Shankar defamed Anil Ravipudi
అయితే తాజాగా వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ద్వారా మరో అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా బడ్జెట్ల గురించి డైరెక్టుగా, మరో డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. మరి ఆయన ఏమన్నారు ఆ వివరాలు చూద్దాం.. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చాలా చిత్రాలు భారీ బడ్జెట్ తో అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ తో వస్తున్నాయి. ఇందులో వందల కోట్లు ఖర్చు చేసి తీసినా, మళ్లీ ఆ చిత్రాలు కనీసం థియేటర్లోకి వచ్చి ఒకటి రెండు రోజులు కూడా ఆడడం లేదు. ఈ విధంగా చాలామంది డైరెక్టర్లు నిర్మాతలను ముంచుతున్నారని చెప్పకనే చెప్పారు. (Anil Ravipudi)
Also Read: Nithya Menen: తమిళ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్లు చేసిన నిత్యమీనన్.. చిన్న చూపు అంటూ.?
కానీ అనిల్ రావిపూడి వీటన్నింటికీ విరుద్ధమని చెప్పారు. ఆయన ఏ సినిమా తీసిన హీరోని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారట. తన సినిమాల వల్ల ఒక్క నిర్మాత కూడా నష్టపోకూడదనే ఆలోచనతో ఉంటారట. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బడ్జెట్ నిర్మాతలకు వచ్చే లాభాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. నేను సినిమా చేస్తే ఆ హీరోకి ఇండస్ట్రీ వద్ద మార్కెట్ ఎంత ఉంది ఆ హీరోతో ఎంత బడ్జెట్ పెట్టి సినిమా చేయాలి అనే విషయాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాతలను సేఫ్ సైడ్ లో ఉంచుతారట. ఎవరైనా సరే డబ్బు చాలా కష్టపడి సంపాదిస్తారు.
వాళ్ళ డబ్బుతో మనం గేమ్ ఆడుకోవడం తప్పు. దమ్ముంటే మీ డబ్బుతో మీరు గేమ్ ఆడుకోండి తప్ప ఇతరులతో ఆడుకోవడం సమంజసం కాదని అన్నారు. నాక్కూడా అద్భుతమైన విజువల్స్ పెట్టి భారీ బడ్జెట్ తో సినిమాలు చేయొచ్చు కదా అనిపిస్తుంది..కానీ ఆ సినిమాకు సెట్ అవుతుందా లేదా అనేది చూసి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆయన మాట్లాడడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మాటలను డైరెక్టర్ శంకర్ కు ఆపాదిస్తూ కొంతమంది నేటిజన్స్ తిడుతున్నారు. గేమ్ చేంజర్ సినిమా పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టించారు శంకర్. మొత్తం సినిమా 500 కోట్లు అయింది. ఈ సినిమాకు అంతలా ఖర్చుపెట్టి తీయాల్సిన అవసరం లేదు. ఆ కథలో అంత డెప్త్ లేదని, అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.(Anil Ravipudi)