Allu Arjun: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరమైనట్టేనా.. సంక్రాంతి వేడుకలకు దూరంగా.?
Allu Arjun: సంక్రాంతి వచ్చిందంటే చాలు సిటీలో ఉండే ప్రతి ఒక్కరు పల్లెటూర్లకు ప్రయాణమై, ఇంటి వద్ద హ్యాపీగా పండగ జరుపుకుంటారు. ఈ పండుగను పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా నిర్వహిస్తారు. అలాంటి సంక్రాంతి పండగ రోజున కోడిపందాలు, ఎద్దుల బండిల పోటీలు, గాలిపటాలు ఎగరవేయడం, పిండివంటలు ఇలా ఎన్నో ఉంటాయి. అలాంటి సంక్రాంతి పండగ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా హ్యాపీగా జరుపుకుంటే మెగా ఫ్యామిలీ కూడా ప్రతి ఏడాది పండగను ఉమ్మడి కుటుంబ సమేతంగా జరుపుకుంటారు.
Is Allu Arjun away from mega family
కానీ ఈసారి వారి కుటుంబంలో పెద్ద చిచ్చే పడ్డట్టు అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ పండగను వేరువేరుగా జరుపుకున్నారు. పోయిన ఏడాది అంతా ఒక్క దగ్గర చేసుకుంటే ఈసారి మాత్రం విడిపోయినట్టే తెలుస్తోంది. మరి ఎవరెవరు ఎక్కడ పండగ చేసుకున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సంక్రాంతి వచ్చిందంటే చాలు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట కూడి చాలా సందడి చేస్తారు. గత సంవత్సరం మెగా కుటుంబీకులంతా కలిసి బెంగళూరులోని ఫామ్ హౌస్ లో చాలా ఎంజాయ్ చేసి జాలీగా గడిపారు. (Allu Arjun)
Also Read: Anupama: అనుపమకి బ్రేకప్ అయ్యిందా.. ఆ మాటల వెనకున్న అర్థం ఏంటి.?
ఈ టైంలో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ కుటుంబాలు మొత్తం ఒక్క దగ్గరే ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం సంక్రాంతిని ఎవరింట్లో వారే జరుపుకున్నట్టు తెలుస్తోంది. దీనికి నిదర్శనం చిరంజీవి తన ఇంట్లో దిగినటువంటి ఫోటోలను షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో జరుపుకున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వీల్లే కాకుండా రామ్ చరణ్ కూడా తన భార్య కూతురుతో దిగినటువంటి ఫోటోలను షేర్ చేశాడు. ఇలా ఎవరికి వారే ఈ పండగను జరుపుకోవడంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ ఫ్యామిలీకి బంధం తెగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మరికొంతమంది మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ దూరం పెట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Allu Arjun)