Nayanthara: విజ్ఞేష్, ప్రభుదేవా, శింబు కాకుండా ఆ హీరోతో నయనతార ఎఫైర్.. పెళ్లి కార్డు లీక్..?
Nayanthara: నయనతార ఈ హీరోయిన్ గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారింది. కేవలం తెలుగు కాకుండా తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో కూడా తన మార్కు చూపించింది. ఈ విధంగా నయనతార సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకుందో తన లవ్ స్టోరీల ద్వారా కూడా అంతే వైరల్ అయింది. ఈమె ఇండస్ట్రీలోని చాలామందితో లవ్ లో పడి చివరికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది.
Nayanthara affair with that hero Marriage card leaked
అలాంటి నయనతారకు సంబంధించినటువంటి ఒక పెళ్లి కార్డు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఆ పెళ్లి కార్డు నయనతార విగ్నేష్ శివన్ లది కాదట. స్టార్ హీరో ఆర్యాది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. హీరోయిన్ నయనతార ముందుగా శింబుతో లవ్ లో పడి కొన్నాళ్లు గడిపిన తర్వాత ప్రభుదేవాతో కమిట్ అయింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతలో ఏమైందో ఏమో వీరు విడిపోయారు. ఆ తర్వాత విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. (Nayanthara)
Also Read: Nayanthara: నయనతారకు బాగా పొగరు.. క్షమించమని కూడా అడగలేదు.?
అలాంటి నయనతార లవ్ స్టోరీల్లో ఆర్యా కూడా ఉన్నారట. యాక్షన్ సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన ఆర్యా ఆ తర్వాత మంచి డెప్త్ ఉండే కథలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆర్యా నయనతార కలిసి రాజారాణి సినిమాలో చేసి అద్భుత పేరు సంపాదించారు. ఒకానొక సమయంలో ఆర్యా తనకు నయనతార అంటే ఎంతో ఇష్టమని కూడా చెప్పారు.
అంతే కాదు తన ఇంట్లో ఫంక్షన్లకు కూడా నయనతార వెళ్లడం అప్పట్లో జరిగింది. 2017లో నయనతార ఆర్యా పెళ్లి అంటూ ఒక కార్డు లీక్ అయింది. అయితే ఆ కార్డు వీరి నిజమైన పెళ్లికి సంబంధించింది కాదట. రాజారాణి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలా చేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన కార్డు మరోసారి వైరల్ అవ్వడంతో ఈమె ఆర్యాతో కూడా పెళ్లికి సిద్ధమైందా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్యా సాయిశా అనే హీరోయిన్ ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్నారు.(Nayanthara)