Pension: EPFO ద్వారా నెలకు రూ. 7500 పెన్షన్..?
Pension: పనిచేసే ఉద్యోగుల కోసం పెన్షన్ పథకం రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఇది పదవి విరమణ తర్వాత ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులకు రూ. 1,000 పింఛన్ వస్తుంది. నెలకు రూ. 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తు నిర్మల సీతారామన్ ను కోరారు. దేశంలోని 78 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పథకంలో చేరారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు ఫ్యాక్టరీల ఉద్యోగులు కూడా ఉన్నారు.
Through EPFO Rs. 7500 pension
ప్రతి ఒక్కరూ పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2014లో కనీస పింఛను రూ. 1,000 గా నిర్ణయించారు. కానీ కొన్ని ఏళ్లుగా ద్రవ్యోల్బణం పెరగడం వల్ల అవసరాలకు ఈ మొత్తం సరిపోవడం లేదు. మూడు నెలల పాటు కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం 12% డిపాజిట్ చేస్తుంది. ఇందులో కంపెనీ ఉద్యోగి ఇద్దరికీ వాటా ఉంటుంది.
Also Read: KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ భారీ ఊరట?
కొందరు ఉద్యోగులు ఉత్తమ పింఛన్ రూ. 5000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రూ. 1000తో వైద్యం, ఇంటి ఖర్చులు భరించడం కష్టమని చెబుతున్నారు. పింఛన్ పెంచాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా పింఛన్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రూ. 7500 పింఛన్ తో లక్షల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. కనీస పింఛన్ పథకంపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టినట్లుగా సమాచారం అందుతోంది.