Sanjana Galrani:ఆ హీరో అక్కడ పట్టుకొని పిసికేసాడు.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
Sanjana Galrani: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు హీరోల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది హీరోలు సినిమా షూటింగ్స్ సమయంలో యాక్షన్ చేయకుండా ఒక్కోసారి రియల్ గా హీరోయిన్లను కాస్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలా ఒక కన్నడ హీరో చేతిలో ఈ స్టార్ హీరోయిన్ చాలా ఇబ్బంది పడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సంజనా గల్రాణి. బుజ్జిగాడు
Sanjana Galrani Shocking comments on that hero
అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి ఆ తర్వాత తెలుగులో అంతగా రాణించలేదు. కొన్నాళ్లకు కన్నడలో మంచి క్రేజ్ మీద ఉన్న ఈమె ఇండస్ట్రీలో బిజీ అవుతున్న సమయంలో డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం అనుభవించింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన ఈమె ఒక ముస్లిం డాక్టర్ ను పెళ్లి చేసుకుంది. అలాంటి ఈ బ్యూటీ కన్నడ స్టార్ హీరో గురించి సంచలన కామెంట్స్ చేసింది. (Sanjana Galrani)
Also Read: Sobhita Dhulipalla: వివాదంలో శోభితా ధూళిపాళ్ల.. తెలుగింటి కోడలువేనా అంటూ ఫైర్.?
కన్నడ ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నాడు. అతనితో నాకు టార్చర్ ఉన్నది. అతను ఎంతో ప్రస్టేషన్ ఉన్న హీరో. ఆయన పేరు చెప్పను కానీ ఒక సీన్ లో డాన్స్ చేస్తున్న సమయంలో నా భుజాలు పట్టుకొని కాస్త కదపాల్సి ఉంటుంది. కానీ ఆ హీరో దర్శకుడు యాక్షన్ చెప్పగానే నా భుజాలపై చేతువేసి గట్టిగా పిసికేశాడు. ఇంత గట్టిగానా నాకు నొప్పిగా ఉంది అని అంటే..అవునా సారీ మేనేజ్ చేసుకో అన్నాడు.
నేను ఇండస్ట్రీలో దెబ్బలు తినడానికి హీరోయిన్ కాలేదు అంటూ ఆయనకు బదులిచ్చాను. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఈ విధంగా కొంతమంది సైకోల వల్ల హీరోయిన్స్ ఇబ్బందులు పడుతుంటారని సంజన చెప్పుకొచ్చింది. ఆయన చేసిన పనికి నేను షూటింగ్ కొంత సమయం వరకు ఆపేశాను. ఈ విధంగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఆ హీరో ఎవరు అనే పేరు చెప్పలేదు.(Sanjana Galrani)