Nikky Galrani: నిక్కీ గల్రానితో ఆ హీరో నిజంగానే అసభ్యంగా ప్రవర్తించాడా.?
Nikky Galrani: ఏ ఇండస్ట్రీ చూసిన ఏముంది గర్వ కారణం అంతా ఈవిటీజింగ్ మయం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల పరిస్థితి. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లను చులకనగా చూస్తూ వారిని ఏదో రకంగా ఇవిటీజింగ్ చేస్తూనే ఉంటారు. ఇంత టెక్నాలజీ వచ్చిన, అమ్మాయిలు ఎంతో అప్డేట్ అయినా కానీ వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇందులో సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అంటే చాలా చులకనగా చూస్తూ దర్శక, నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ ఏదో ఒక రకంగా లొంగబరచుకోవాలని చూస్తూ ఉంటారు.
Did the hero really misbehave with Nikky Galrani
అలా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్లలో నిక్కీ గల్రాని కూడా ఒకరు. కన్నడ నటి కస్తూరి సంజన అంటే మనందరికీ తెలుసు. ఆమె చెల్లెలే నిక్కీ గల్రాని. ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న సమయం లోనే ఈమె ఆది పినిశెట్టిని ప్రేమించి వివాహం చేసుకుంది. అలాంటి నిక్కి గల్రాని గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను ఒక స్టార్ హీరో వేదించాడని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మరి ఆ హీరో ఎవరు? వివరాలు ఏంటో చూద్దాం.. (Nikky Galrani)
Also Read: Nayanthara: విజ్ఞేష్, ప్రభుదేవా, శింబు కాకుండా ఆ హీరోతో నయనతార ఎఫైర్.. పెళ్లి కార్డు లీక్..?
నిక్కీ గల్రాని టాలీవుడ్ లో కమెడియన్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరకతమణి తమిళ్ డబ్బింగ్ మూవీ మలుపు చిత్రంలో కూడా హీరోయిన్ గా చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో జీవాతో ఒక ఒక చిత్రంలో చేసే సమయంలో ఆయన నిక్కీని టార్చర్ చేశాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.. ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ ఆమెపై వ్యతిరేక కామెంట్లు పెట్టారు. దీంతో భయపడి పోయిన నిక్కి ఆ పోస్ట్ డిలీట్ చేసింది. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆ పోస్ట్ నేను పెట్టలేదు నా సోషల్ మీడియా ఖాతాను ఎవరో హ్యాక్ చేసి పోస్ట్ చేశారంటూ చెప్పుకొచ్చింది.
ఇంతటితో ఆగకుండా డైరెక్ట్ గా జీవా వద్దకు వెళ్లి నేను ఆ పోస్ట్ పెట్టలేదు సారీ సార్ అంటూ బ్రతిమిలాడిందని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ విధంగా చేయని తప్పుకు జీవాను ఆమె ఇరికించిందని, ఈ విషయం అక్కడితో ఆగిపోవాలి అంటే నిక్కీ జీవా కలిసి మరో సినిమాలో చేయాలని డిసైడ్ అయ్యారట. అనుకున్న వెంటనే వీరు కీ అనే చిత్రంలో నటించి వారి మధ్య ఉన్నటువంటి వైరాన్ని సమసిపోయేలా చేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో విధమైన కామెంట్లు పెడుతున్నారు.(Nikky Galrani)