Lotus Seeds: తామర గింజలు తింటున్నారా… 100 రోగాలకు చెక్ ?
Lotus Seeds: తామర గింజలు మఖానాగా పిలుచుకునే ఈ గింజలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలుకు చేకూరుస్తాయి. అయితే వీటిని కొంతమంది పచ్చిగానే తింటుంటే…. మరికొంతమంది వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరలలో, స్వీట్లలో భాగం చేసుకొని తింటారు. ఎలా తిన్నా సరే తామర గింజలు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. నిజానికి మఖాన ఆరోగ్యానికి చాలా మంచిది.
Lotus Seeds Benefits For Human
మఖానాను చిరు తిండిగా భావిస్తారు. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మఖనాలో విటమిన్ ఏ, డి, కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఫ్యాట్, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మఖానాలో క్యాలరీల శాతం చాలా తక్కువ అందుకే బరువు పెరుగుతారని భయం అసలు ఉండదు. చలికాలంలో మఖాన తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మఖాన స్వభావరీత్యా వేడితత్వం కలిగి ఉంటుంది.
Also Read: Rinku Singh: రింకూ సింగ్ చేతిపై కొత్త టాటూ..సీక్రెట్ ఇదే ?
చలి కాలంలో రోజు 30 గ్రాములు మఖాన తినడం వల్ల శరీరం వెచ్చగా మారుతుంది. చలి నుంచి కాపాడుతుంది. అలాగే మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల కడుపు చాలా సేపు నిండిన భావన ఉంటుంది. బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పాలలో నానబెట్టిన మఖాన తింటే హాయిగా నిద్రపోడుతుంది. మఖాన తినడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖాన తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. మధుమేహ రోగులు కూడా ఎలాంటి భయం లేకుండా దీనిని తినవచ్చు. ఇది చర్మానికి ఎంతో మేలును కలిగిస్తుంది.