Rinku Singh: ఎంపీ ప్రియాతో రింకూ సింగ్‌ నిశ్చితార్థం.. అంత ఫేక్ అట ?

Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వైట్-బాల్ ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్లలో రింకూ సింగ్ ఒకరు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో భాగం అయ్యాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఒక మ్యాచ్‌లో యష్ దయాళ్ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత పాపులర్ అయ్యాడు భారత క్రికెటర్ రింకూ సింగ్‌. ఆ తర్వాత టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

Rinku Singh engaged to Samajwadi Party MP Priya Saroj

అయితే, రింకూ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్‌పై మచ్లిషహర్ నుంచి ఎంపీ అయ్యారు ప్రియా సరోజ్. 1999, 2004 మరియు 2009లో మూడుసార్లు — మచ్లిషహర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ SP నాయకుడు తుఫానీ సరోజ్ కుమార్తెనే ఈ ప్రియా సరోజ్. ఇక నవంబర్ 1998లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారు ప్రియా సరోజ్.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ

ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ నుండి ఎల్‌ఎల్‌బి (బ్యాచిలర్ ఆఫ్ లాస్)ను పూర్తి చేసింది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. కానీ భారత క్రికెటర్ రింకూ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం కాలేదని సీనియర్ SP నాయకుడు తుఫానీ సరోజ్ పేర్కొన్నారట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *