Venkatesh:భారీ మల్టీస్టారర్ లో వెంకటేష్.. బడా హీరోతో పోటీ.?
Venkatesh: వెంకటేష్ ఏ పాత్రలో అయినా ఇట్టే ఓదిగిపోయే హీరో.. ఇక వెంకటేష్ కు కామెడీ పాత్రలైతే థియేటర్ లో బొమ్మ అదిరిపోవాల్సిందే.. అలా ఇండస్ట్రీలో 6 పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ వెంకటేష్ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నాడు.
Venkatesh in a big multi-starrer
కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది అంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇంకా సంక్రాంతి బరిలో వచ్చినటువంటి రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్, అలాగే బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలను తలదన్నేలా సంక్రాంతి వస్తున్నాం సినిమా ఉంది. అలా ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై అభిమానుల్లో కాస్త ఆసక్తి నెలకొని ఉంది.(Venkatesh)
Also Read: Assistant director: ఛాన్స్ ఇస్తానని హోటల్ రూమ్ లో మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి..?
ఇదే తరుణంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం అందుతుంది. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ ఇండియా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో వెంకటేష్ పాత్ర కూడా ఉంటుందట. మహేష్ బాబుకు అన్నగా వెంకటేష్ నటించబోతున్నారని ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే వెంకటేష్ మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. ఈ కాంబో మళ్లీ రిపీట్ అవబోతుండడంతో వెంకటేష్, మహేష్ బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజము ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. మరి చూడాలి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.(Venkatesh)