Nara Lokesh: తెలంగాణలో టీడీపీ రీ – ఎంట్రీ ?
Nara Lokesh: తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది టిడిపి. పార్టీని పునర్నిర్మిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే అనౌన్స్ చేయగా…. తాజాగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంపై స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ విస్తరిస్తామని అన్నారు.
Nara Lokesh Comments on tdp in telangana re entry
ఈ దిశగా చర్చలు జరుపుతున్నామని, భవిష్యత్ కార్యాచరణ గురించి అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని అన్నారు.
వాటిపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ చాలా ఉందంటూ వెల్లడించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో టిడిపిపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉన్నదని, స్వచ్ఛందంగా 1.6 లక్షల మంది సభ్యత్వాలు పొందడమే దానికి ఉదాహరణ అని చెప్పారు. తమకు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు.