Saif Ali Khan: లక్షల మంది సాధువుల తలలు నరికి.. అందుకే సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి..?
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో మొత్తం ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే ఈయనపై కత్తి దాడి జరిగిందో అప్పటినుండి చాలామంది పరామర్శిస్తున్నారు. అలాగే కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.అయితే కత్తి దాడికి గురై హాస్పిటల్ లో సైఫ్ చికిత్స పొందుతున్న వేళ ఆయన గురించి ఓ సంచలన నిజం బయటపడింది.ఈ మహా కుంభ వేళ సమయంలో సైఫ్ పై కత్తి దాడి అందుకే జరిగింది అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేస్తున్నారు.
Thats why Saif Ali Khan was attacked with a knife
మరి ఇంతకీ మహా కుంభ మేళకి సైఫ్ పై జరిగిన కత్తి దాడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చూస్తే కరీనాకపూర్ సైఫ్ అలీ ఖాన్ లకి పుట్టిన ఇద్దరు కొడుకులకు తైమూర్,జహంగీర్ అనే పేరు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో జహంగీర్ పేరు బానే ఉంది.కానీ తైమూర్ పేరు పెట్టిన సమయంలో సైఫ్ దంపతులకు వ్యతిరేకత ఏర్పడింది. తైమూర్ పేరుని వెంటనే తొలగించాలని,మీ కొడుకుకి ఆ పేరుని పెట్టకండి అని చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే తైముర్ అనే పేరు 1398లో ఢిల్లీని ఆక్రమించిన టర్కో మంగోలి రాజ వంశీయుడి కి చెందిన పేరు.(Saif Ali Khan)
Also Read: Saif Ali Khan: పనిమనిషితో ఎఫైర్ వల్లే సైఫ్ అలీ ఖాన్ ని చంపాలనుకున్నారా..?
అయితే ఆ పేరు పెట్టుకున్న తైమూర్ అప్పట్లో జరిగిన యుద్ధంలో ఎంతో మందిని పొట్టన బెట్టుకున్నారు. అంతేకాదు అప్పుడు జరిగిన మహా కుంభమేళకు వచ్చిన లక్షల మంది సాధువుల తలలు నరికాడు. అలాంటి వ్యక్తి పేరు మీ కొడుకుకు పెట్టడం మంచిది కాదు అని చాలామంది సలహాలు ఇచ్చారట.అంతే కాదు కొంతమంది ఆ పేరు తీసేయమని డిమాండ్ చేశారట. కానీ సైఫ్ దంపతులు మాత్రం ఆ పేరు పై ఎంత వ్యతిరేకత వచ్చినా తమ కొడుక్కి పెట్టుకున్నారు.
అయితే సైఫ్ బాయ్ ఫ్రెండ్ పేరు తైముర్ అని,అందుకే అతని గుర్తుగా తన కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నామని కరీనా చెప్పుకొచ్చింది. కానీ తైముర్ పేరుని చాలామంది వ్యతిరేకించారు. అయితే తాజాగా మహాకుంభమేళా జరిగిన సమయంలోనే సైఫ్ పై కత్తి దాడి జరగడంతో మీ కొడుక్కి తైమూర్ అనే పేరు పెట్టకండి అంటే వినలేదు. అందుకే ఈ మహా కుంభ వేళ సమయంలోనే సైఫ్ పై కత్తి దాడి జరిగింది. తైమూర్ అనే పేరు పెట్టడం వల్లే సాధువులు మహా పుణ్యం గా భావించే మహాకుంభమేళా వేళ ఈ దాడి జరిగింది అంటూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు.(Saif Ali Khan)