Pawan – Lokesh: కూటమిలో ముదురుతున్న ‘డిప్యూటీ సీఎం’ గొడవ!
Pawan – Lokesh: కూటమిలో ‘డిప్యూటీ సీఎం’ పదవి గొడవ ముదురుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ.. విపరీతంగా డిమాండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతోంది. ఇందుకు ఆజ్యం పోస్తూ.. పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడిగితే తప్పేంటంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మ.
Tdp Leaders comments on nara lokesh and pawan kalyan
వరదలు వచ్చిన సమయంలో జగన్‌ని చూసి జనం ‘సీఎం సీఎం’ అని నినదించారని కదా అంటూ గుర్తు చేస్తున్నారను పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మ. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసేన అభిమానులు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు అలాగే లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నారని వివరణ ఇస్తున్నారు పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మ.
Pension: EPFO ద్వారా నెలకు రూ. 7500 పెన్షన్..?
పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మతో పాటు టీడీపీ కీలక నేతలందరూ ఇవే వ్యాఖ్యలు చేశారు. దీంతో నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ.. విపరీతంగా డిమాండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతోంది. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు.. టిడిపి కార్యకర్తల మనసులో మాట అంటూ సీనియర్ లీడర్లు.. జనసేనాని పవన్ కళ్యాణ్ పదవికే ఎసరు పెడుతున్నారు. ఏదేమైనా అధినేత తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.