Samantha: డైరెక్టర్ తో సమంత ఎఫైర్ నిజమే.. త్వరలోనే రెండో పెళ్లి.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయిందిగా..?
Samantha: ఏంటి ఆ డైరెక్టర్ తో సమంత నిజంగానే ప్రేమలో ఉందా.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయిందా.. ఇంతకీ ఆ వార్తల్లో ఉన్న నిజం ఎంత..అనేది ఇప్పుడు చూద్దాం. సమంత చాలా రోజుల నుండి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లు ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సమంత తెలుగులో కనిపించడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లెహ్రెన్ అనే వెబ్ సైట్ వాళ్ళు సంచలన విషయాన్ని బయట పెట్టారు.
Samantha Relation with the director is real
తమిళ ఛానల్ అయినటువంటి గలాటా ఇండియా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సమంత గురించి ఒక షాకింగ్ విషయం బయటపడిందని రాసుకోచ్చింది. గలాటా ఇండియా ఛానల్ లో సమంత ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆమెకు ఓ డైరెక్టర్ నుండి ఆడియో మెసేజ్ వచ్చింది.అది లైవ్ లోనే ఓపెన్ చేసి విన్న సమంత ఆ తర్వాత సిగ్గుతో నవ్వుకుంది. ఒక లవర్ మెసేజ్ పెడితే ఎలా అయితే ప్రియురాలు సిగ్గు పడుతుందో అలాగే సమంత కూడా చేసింది.(Samantha)
Also Read: Akkineni Akhil: అక్కినేని అఖిల్ జైనబ్ ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
అంటూ లెహ్రెన్ వాళ్ళు రాస్కొచ్చారు.అంతేకాదు సమంతని దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా సమంతకు మెసేజ్ రావడంతోనే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయ్ అంటూ చెప్పారని,అది ఆ డైరెక్టర్ మెసేజ్ అని వాళ్ళు చెప్పినట్లు రాసుకొచ్చినట్టు బాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్ అయినటువంటి షాహిద్. కాం లో ఈ వార్త రాశారు.
అయితే చాలా రోజుల నుండి సమంత రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉంది అని వార్తలు వినిపిస్తున్న వేళ కొన్ని ప్రముఖ వెబ్సైట్లో ఇలాంటి వార్తలు రావడం నిజంగానే సమంత డేటింగ్ లో ఉంది అనడానికి ఉదాహరణలుగా మారుతున్నాయి. అలాగే సమంత ఆ డైరెక్టర్ తో ప్రేమలో ఉంది అనడానికి ఇది కూడా ప్రూఫ్ అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి నిజంగానే సమంత ఆయనతో ప్రేమలో ఉందా అనేది తెలియాలంటే కచ్చితంగా ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే అని సామ్ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు.(Samantha)