Balakrishna: ఆదివారం బాలకృష్ణకి ఆ కలర్ డ్రెస్ వేసుకుంటే ప్రమాదమా.. నడుము కూడా విరిగిందా.?
Balakrishna: ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. తన నాన్న లాగే ఓవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ మరోవైపు సినిమాలను కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి బాలక్రిష్ణ తాజాగా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ సినిమాతో మనం ముందుకు వచ్చారు. బాబీ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరహో అనిపిస్తుంది..
Is it dangerous for Balakrishna to wear that color dress on Sunday
అలాంటి డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక అనూహ్యమైన విషయాన్ని బయట పెట్టారు.. యాంకర్ సుమ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబి, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ పలువురు నటినటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నాకు నలుపు రంగు దుస్తులు ధరిస్తే కలిసిరావని అన్నారు.. ఒకవేళ అనుకోకుండా ధరించిన ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు. (Balakrishna)
Also Read: Sr. NTR: రెండో భార్యతో పిల్లల కోసం ఎన్టీఆర్ స్టెరాయిడ్స్.. హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.?
తనది మూలా నక్షత్రమని, నలుపు తనకు మంచిది కాదని, ఆదివారం నలుపు ధరిస్తే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అన్నారు. నేను ఆదిత్య 369 సినిమా షూటింగ్ లో భాగంగా ఆదివారం రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నడుము భాగంలో దారుణంగా గాయపడి చాలా రోజులపాటు ఇబ్బందుల పాలయ్యారని అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు ఆదివారం షూటింగ్ నిర్వహించారు. ఆరోజు నేను మనసులో ఏదో ఆందోళన చెందుతూనే బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్లాను.
అదే రోజు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా షూటింగుకు వచ్చారు. కానీ అక్కడే నాకు చిన్న యాక్సిడెంట్ జరిగి నడుము విరిగిపోయిందని అన్నారు. ఇక ఈ ఘటన చూసి ఎంతో టెన్షన్ పడినా ఎస్పీ అప్పటినుంచి సినిమా షూటింగ్ కు రాలేదని బాలయ్య చెప్పుకొచ్చారు.. అంతేకాదు నేను షూటింగ్ చేసే సమయంలో ప్రొడక్షన్ వారు పెట్టే ఫుడ్డే తింటానని, నా ఇల్లు పక్కన ఉన్న కానీ అక్కడే ఆహారం తీసుకుంటానని తెలియజేశారు. ఏది ఏమైనా బాలకృష్ణ ప్రతి విషయాన్ని ముక్కు సూటిగా చెబుతారు. ప్రస్తుతం ఆయన నటించిన డాకుమహారాజు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకుపోతోంది.(Balakrishna)