Dil Raju: దిల్ రాజు అనిల్ రావిపూడి ఆఫీస్ లో ఐటి సోదాలు.. వాళ్ల కుట్రేనా..?
Dil Raju: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్రొడ్యూసర్లలో ముందు స్థానంలో ఉంటారు దిల్ రాజ్. ఎక్కువగా కొత్త యాక్టర్స్ ను చిన్న సినిమాల ద్వారా పరిచయం చేసే గొప్ప ఘనుడు. ఈయన ప్రొడ్యూస్ చేసిన చాలా సినిమాల ద్వారా కొత్త కొత్త యాక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయమై వారి అదృష్టాన్ని పరీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. అలా ఎంతో మందికి లైఫ్ ఇచ్చినటువంటి దిల్ రాజ్ కేవలం చిన్న సినిమాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
IT raids in Dil Raju Anil Ravipudi office
ఇలా ఇండస్ట్రీలో టాప్ నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజ్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఆయన ఇంట్లో ఆఫీసుల్లో మొత్తం ఒకేసారి ఎనిమిది చోట్ల ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు సోదాలు నిర్వహించారు.. కేవలం ఆయన ఇంట్లోనే కాకుండా తన తమ్ముడైనటువంటి శిరీష్, లక్ష్మణ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీస్ ల్లో, అలాగే తన కూతురు ఇంట్లో కూడా ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది. ఆయన ఇల్లుతో పాటుగా హైదరాబాదులోని బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి జూబ్లీహిల్స్ పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు..(Dil Raju)
Also Read: Samantha: డైరెక్టర్ తో సమంత ఎఫైర్ నిజమే.. త్వరలోనే రెండో పెళ్లి.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయిందిగా..?
ఈ ప్రాసెస్ లో మొత్తం అధికారులు 55 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు..దీంతో దిల్ రాజు గురించి సోషల్ మీడియాలో మెయిన్ వీడియోలో వార్తలు హైలైట్ గా నిలుస్తున్నాయి. సినిమాల విషయానికొస్తే ఇటీవల వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.
కానీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ వర్క్ చేశాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నటువంటి ఈయనకు ఇటీవల తెలంగాణ సర్కార్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది.(Dil Raju)