Kannappa: ప్రభాస్ చేయాల్సిన కన్నప్ప.. మంచు విష్ణు చేతికి ఎలా వచ్చిందంటే.?
Kannappa: మంచు విష్ణు నా డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పని చాలా రోజుల నుండి ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకి 200 కోట్లు ఖర్చు పెడుతూ భారీ తారగాణాన్ని ఇందులో తీసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మొదలు మలయాళం నటుడు మోహన్ లాల్, మోహన్ బాబు,ప్రభాస్,నయనతార,కాజల్, శరత్ కుమార్ వంటి ఎంతోమంది నటీనటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. అయితే అలాంటి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ప్రభాస్ చేయాల్సిందట.కానీ మోహన్ బాబు మాటల కారణంగా ఆ ప్రాజెక్టు మంచు విష్ణుకి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ కన్నప్ప మూవీని ప్రభాస్ ఎందుకు చేయలేదు? ఈ ప్రాజెక్టులోకి విష్ణు ఎలా వచ్చారు అనేది చూద్దాం.
How did Prabhas Kannappa get in the hands of Manchu Vishnu
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కన్నప్ప కి సంబంధించిన ఎన్నో సినిమాలు చేశారు. అలా తన తర్వాత తన కొడుకు ప్రభాస్ కూడా కన్నప్ప మూవీ లో నటించాలి అని కృష్ణంరాజు ఎన్నో కలలు కన్నారట. అందుకు తగ్గట్టు ప్రభాస్ కోసం కథ కూడా రెడీ చేశారట. కానీ సడన్గా ఓ రోజు మోహన్ బాబు కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన సమయంలో నేను ప్రభాస్ తో కన్నప్ప సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే అరెరే విష్ణు తో నేను కూడా ఆ సినిమా చేయాలనుకుంటున్నాను అని మోహన్ బాబు చెప్పారట. (Kannappa)
Also Read: Dil Raju: దిల్ రాజు అనిల్ రావిపూడి ఆఫీస్ లో ఐటి సోదాలు.. వాళ్ల కుట్రేనా..?
ఇక మోహన్ బాబు మాటలను గౌరవించిన కృష్ణంరాజు తాను రాసుకున్న కన్నప్ప స్టోరీ ని కూడా మోహన్ బాబుకి ఇచ్చేసి నాకు ప్రభాస్ విష్ణు ఇద్దరూ ఒకటే విష్ణుతో నువ్వు ఈ సినిమా చేయు అని ఆయన చేతిలో పెట్టారట. అలా ప్రభాస్ చేయాల్సిన కన్నప్ప మూవీ మంచు విష్ణు చేతిలోకి వచ్చింది. అలాగే ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడుగా కొనసాగుతున్న తనికెళ్ల భరణి కూడా కన్నప్ప మూవీ స్టోరీ రాసుకున్నారట.అయితే ఈ విషయం విష్ణుకి తెలియగా నేను హాలీవుడ్ సినిమా లెవెల్లో దీన్ని తెరకెక్కించబోతున్నాను అని చెప్పారట.
దానికి తనికెళ్ల భరణి నేను అంత బడ్జెట్ పెట్టి ఫైటింగ్ లు పెట్టి చెయ్యను. సినిమా రెండు మూడు కోట్లలో కానిద్దాం అనుకున్నాను.ఈ సినిమా చేయడానికి అంత ప్రెజర్ తీసుకోవడం నావల్ల కాదు నువ్వే చేయు అని మంచు విష్ణు చేతిలో ఆయన రాసుకున్న ప్రాజెక్టు కూడా పెట్టారట. అలా అటు కృష్ణంరాజు ఇటు తనికెళ్ల భరణి ఇద్దరూ తాము రాసుకున్న స్టోరీని మంచు విష్ణుకు ఇవ్వడంతో ఆయన కన్నప్ప స్టోరీకి మరిన్ని మార్పులు చేర్పులు చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారట.(Kannappa)