KL Rahul: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రాహుల్ టీమిండియాలో కనిపించడం లేదు. చాలాకాలం తర్వాత మళ్లీ టీమిండియాలో కనిపించాడు. 2024 ఐపీఎల్ సమయంలో రాహుల్ గాయపడి కోలుకున్న తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా తరఫున ఆడాడు. కానీ లంకతో జరిగిన సిరీస్ లో మాత్రం రాహుల్ ప్రదర్శన పెద్దగా కనిపించలేదు. KL Rahul

KL Rahul bids goodbye to international cricket

దీంతో మూడో వన్డే నుంచి రాహుల్ ను జట్టు నుంచి తొలగించారు. లంకతో సిరీస్ లో పేలవ ప్రదర్శన కనబరిచిన రాహుల్ కు మళ్ళీ భారత జట్టులో చోటు దక్కాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా…. కేఎల్ రాహుల్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కేఎల్ రాహుల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేరుతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ పోస్టులో రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా ఉంది. KL Rahul

Also Read: Prithvi Shaw: పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న టీమిండియా ప్లేయర్?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో “చాలా ఆలోచించిన తర్వాత, ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ నా జీవితంలో ఓ ముఖ్యమైన భాగం అయినందుకు ఈ నిర్ణయం అంతా సులభం కాదు. నా కెరీర్ లో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు. మైదానంలోనూ, బయట మీరు పొందిన అనుభవాలు, జ్ఞాపకాలు నిజంగా వెలకట్టలేనిది. KL Rahul

నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను. చాలామంది ప్రతిభావంతులైన దిగ్గజ క్రికెటర్లతో ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ” అని ఈ పోస్టులో రాసి ఉంది. ఇదిలా ఉండగా ….కేఎల్ రాహుల్ తన క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి సొంతంగా ఓ బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. KL Rahul