Black Tea: బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Black Tea: రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. బ్లాక్ టీ తాగినట్లయితే అనేక రకాల వ్యాధులు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ టీ అలవాటు లేని వారు అదే తాగాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఆపిల్, సిట్రస్ పండ్లు, నట్స్ ఫ్లేవర్స్ చాలా దొరుకుతాయి. శరీరంలో కెల్లా పొట్టలోని అవయవాలకి, కాళ్ళకి మంచి రక్తాన్ని అందించే రక్తనాళాన్ని పరిశీలించినప్పుడు ఫ్లేవరాయిడ్లు ఎక్కువగా తీసుకునే వారిలో కాల్సిఫికేషన్ తక్కువగా ఉందట.
Black Tea Benefits
దీనివల్ల గుండెపోటు, పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అంతేకాదు వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని సైతం ఈ రక్తనాళం పనితీరును బట్టి తెలుసుకోవచ్చు. అలాగే పాలకు బదులు రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగితే ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్లాక్ టీ గుండె జబ్బులను నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. అజీర్ణం, వీరేచనాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతాము.
నిమ్మకాయతో బ్లాక్ టీని చేసుకొని తాగాలి. బ్లాక్ టీ తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది. అందువల్ల ఇది ఫిట్నెస్ కు చాలా మంచిది. బరువు నియంత్రణలో ఉన్నవారు బ్లాక్ టీ తాగవచ్చు. బ్లాక్ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తరచుగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో బ్లాక్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా కండరాలు చురుకుగా పనిచేస్తాయి.