Monalisa: మోనాలిసాకి బంపర్ ఆఫర్.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.?
Monalisa: దేశంలో అత్యంత పెద్దదైన పుష్కరాల్లో మహా కుంభమేళా ఒకటి.. ఈ కుంభమేళకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేస్తూ ఉంటారు.కొన్నేళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళకు వెళ్తే పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయని నమ్ముతారు. అలాంటి కుంభమేళా ప్రస్తుతం చాలా అట్ఠహాసంగా సాగుతోంది. ఈ కుంభమేళకు కోట్లాదిమంది భక్తులు వస్తున్నారు.
Bumper offer for Monalisa
అలాంటి ఈ కుంభమేళ పుణ్యమా అని ఒక అమ్మాయి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది.. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే.. మోనాలిసా కుంభమేళలో దండలు అమ్ముకుంటూ ఎంతో అమాయకంగా కనిపించే ఈ అమ్మాయి అందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. తేనెకళ్లతో అద్భుతంగా హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. (Monalisa)
Also Read: Monalisa: బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన మహా కుంభమేళ మోనాలిసా..?
అలాంటి ఈ న్యాచురల్ బ్యూటీని చూసి కుంభమేళకు వచ్చిన వారంతా వారి ఫోన్ లో రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ట్రెండింగ్ లోకి వచ్చింది.. అలాంటి ఈ తరుణంలో ఆమెకు దేశంలోని చాలా ఇండస్ట్రీల నుంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా రామ్ చరణ్ చేస్తున్నటువంటి ఆర్సి 16 సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఇప్పటికే జాన్వి కపూర్ హీరోయిన్ గా ఉంది. సెకండ్ హీరోయిన్ గా మోనాలిసాను తీసుకుంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుందట. దీనివల్ల దేశవ్యాప్తంగా సినిమాకు మంచి హైప్ రావడమే కాకుండా, ఆమె కూడా మంచి పేరు వస్తుందని మూవీ యూనిట్ భావించినట్టు సమాచారం. అన్ని ఓకే అయి ఆమె సినిమాలో నటిస్తే మాత్రం ఆమె లైపే టర్న్ అవుతుందని కొంతమంది అంటున్నారు.(Monalisa)