Samantha: ఏంటి నాగచైతన్యకు తన తల్లిని సమంత దూరం చేసిందా? అందుకే చైతన్యకు దూరంగా ఉంటూ రీసెంట్గా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా ఇష్టం లేక రాలేదా అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్య ల ప్రేమని,పెళ్లిని అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ అలాగే నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య లక్ష్మి కూడా అంగీకరించింది. అలా సమంత నాలుగు సంవత్సరాలు అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యామిలీలో కోడలుగా మంచి గుర్తింపు సంపాదించింది.
Samantha who alienated Naga Chaitanya’s mother
ఇక దగ్గుబాటి లక్ష్మి కి కూడా చాలా క్లోజ్ అయింది.కానీ ఎప్పుడైతే ఇద్దరి మధ్య గొడవలువచ్చి విడాకులు తీసుకున్నారో అప్పటినుండి లక్ష్మి నాగచైతన్య పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు లక్ష్మికి ఎంతో ఇష్టమైన కోడలు సమంతకి విడాకులు ఇవ్వడంతో నాగచైతన్య పై మరింత కోపం పెంచుకొని సరిగ్గా మాట్లాడడం లేదట. అందుకే ఈ మధ్య నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకుంటాను అని లక్ష్మికి చెప్పగా ఆమె నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పిందట. కానీ ఆయన రెండో పెళ్లి విషయంలో సంతోషించలేదట. (Samantha)
Also Read: Nagarjuna: నాగార్జున కి ‘శోభిత రాక’ కలిసి రాలేదా.. ఆస్తులన్నీ మాయం.?
దానికి కారణం సమంత పై లక్ష్మికి ఇంకా ప్రేమ తగ్గలేదు. ఇప్పటికి కూడా తన దృష్టిలో సమంతనే కోడలు అని అనుకుంటుందట. ఇక సమంత మయాసైటిస్ బారిన పడ్డప్పుడు కూడా లక్ష్మీ ప్రతిసారి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకుందట. అయితే తన కొడుకు కోడలు విడిపోవడానికి శోభితనే కారణమని, అందుకే శోభిత మీద కోపం పెంచుకొని నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ కి లక్ష్మీ రాలేదట. అలా ఒకరకంగా సమంత నాగచైతన్యకి లక్ష్మి కి మధ్య దూరం పెంచినట్టు తెలుస్తోంది.ఇక సమంత కేవలం నాగచైతన్యను తన తల్లికి మాత్రమే దూరం చేయలేదు.
దగ్గుబాటి ఫ్యామిలీకి కూడా దూరం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో లక్ష్మీ తో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది. అలా సమంత కారణంగా నాగచైతన్య అటు దగ్గుబాటి ఫ్యామిలీకి ఇటు తన తల్లికి ఇద్దరికీ దూరమయ్యారని కొన్ని నెగటివ్ పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేమీ లేదు నాగచైతన్య తల్లికి ఈ పెళ్లి ఇష్టమే. ఆమె పనిలో బిజీగా ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ కి రాలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వచ్చి అందరి నోళ్ళు మూయిస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు.(Samantha)