Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నాగార్జునకి సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడమే. అయితే అక్రమ కట్టడం కారణంగా దాన్ని కూల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు.
Is ANR like that.. Does he treat his own son Nagarjuna so cheaply
ఈ విషయం పక్కన పెడితే.. నాగార్జున అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఏఎన్నార్ ఓ సమయంలో చాలా అవమానించారట.. అదేంటంటే నాగార్జున చిన్నతనంలో స్కూల్ కి వెళ్లే సమయంలో ఒక సైకిల్ కొనియ్యండి నాన్న అని అడిగారట.కానీ ఏఎన్ఆర్ మాత్రం డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా.. స్కూల్ కి వెళ్లడానికి సైకిల్ అవసరమా.. నువ్వు ముందుగా పాస్ అవ్వు నీకు సైకిల్ కొనిస్తాను అని చెప్పారట.(Nagarjuna)
Also Read: Nagarjuna: నాగార్జున కి ‘శోభిత రాక’ కలిసి రాలేదా.. ఆస్తులన్నీ మాయం.?
అయితే అప్పుడు ఏఎన్నార్ రేంజ్ కి సైకిల్ కాదు బండి కాదు కారు కొనియ్యగలరు.కానీ ఏఎన్నార్ అలా చేయలేదు. ఎందుకంటే నాగార్జునకి డబ్బు విలువ,కష్టం విలువ తెలియాలని స్కూల్ కి వెళ్లేటప్పుడు అందరిలాగే నడుచుకుంటూ వెళ్ళామనేవారట.అంతేకాకుండా ఆయన కాలేజీ చదువుకునే సమయంలో సైకిల్ కొనిచ్చారు..
అలా కష్టం విలువ తెలియాలని నాగేశ్వరరావు ఎంత డబ్బున్నా కూడా తన కొడుకు నాగార్జునకి డబ్బులు ఊరికే ఇచ్చేవాడు కాదట. ఇక విదేశాల్లో పై చదువుల కోసం పంపినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పంపిస్తున్నాను అని చెప్పారట. అలా ఏఎన్ఆర్ చేసిన పనులే నాగార్జున ఎదుగుదలకు తోడ్పడ్డాయట. ఇక ఏఎన్ఆర్ చివరి రోజుల్లో నా కొడుకులను కూతుర్లను మంచి దారిలో పెట్టాను కానీ మనవళ్ళ విషయంలోనే బాధగా ఉంది అని ఎప్పుడూ అనేవారట.(Nagarjuna)