Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదని అందరికీ తెలుసు. కానీ ఆ హీరోకి పెళ్లయిందని, ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకుని రహస్యంగా ఇల్లు కూడా కట్టించాడు అనే రూమర్ అప్పట్లో బీటౌన్ లో చక్కర్లు కొట్టింది. అయితే చాలామంది ఈ రూమర్ నిజమే అనుకున్నారు. కానీ సడన్గా ఇరువురి గురించి మరొక ట్విస్ట్ బయటపడింది.మరి సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు..
Salman Khan who married that heroine and built a house… is it true
నిజంగానే ఇల్లు కట్టించారా అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆసిన్ ని పెళ్లి చేసుకొని ఇల్లు కట్టించాడనే రూమర్ ఎంతలా వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు.అసిన్,సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.అలా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి వీరి మధ్య పెళ్లి వార్తలు డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. (Salman Khan)
Also Read: Heroine: ఆరేళ్ల కొడుకును పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్..?
అంతేకాదు అసిన్ ని సల్మాన్ ఖాన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక లగ్జరీ ఇల్లు కూడా కట్టించాడనే రూమర్ వినిపించింది. దాంతో ఈ రూమర్ ఇంకా ఎక్కడికి దారి తీస్తుందోనని అని అసిన్ భయపడి వెంటనే ఈ రూమర్ కి క్లారిటీ ఇచ్చింది.నేను ఓ సినిమాలో బిజీగా ఉన్నాను. అందుకే ఈ రూమర్స్ ని పట్టించుకోలేదు.
నేను సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోలేదు.నాకు ఆయన ఏ ఇల్లు కట్టించలేదు.. ఇదంతా పుకారే అంటూ కొట్టి పారేసింది. అయితే ఈ పుకారు వినిపించిన నేపథ్యంలో ఓ రోజు సల్మాన్ ఖాన్ అసిన్ దగ్గరికి వచ్చి ఇల్లు ఎలా ఉంది అని అనడంతో అక్కడే ఉన్న వాళ్ళందరూ చాలా నవ్వేసారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో అసిన్ బయటపెట్టింది.(Salman Khan)