Perfume: పెర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?
Perfume: నేటి కాలంలో చాలా మంది పెర్ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టరు. పర్ఫ్యూమ్ లేకుండా బయటకి రానివారు చాలామంది ఉన్నారు. దానికి అనుగుణంగానే మార్కెట్లలో మనసు దోచే రకరకాల పెర్ఫ్యూమ్స్ అమ్మాయిల బ్యాగుల్లో ఉంటున్నాయి. అయితే పర్ఫ్యూమ్ ని ఎంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని వాడడంపై చాలామందికి జాగ్రత్తలు తెలియవు. చాలామంది రోజువారి జీవనశైలిలో ప్రతిరోజు రకరకాల పెర్ఫ్యూమ్ లు, డీయోడరెంట్ లను వాడితో ఉంటారు. కానీ దాని సువాసన చాలా తొందరగా పోతుంది.
How To Use Perfume
దీంతో తాము వాడే బ్రాండ్ మంచిది కాదేమోనని అందరూ అనుకుంటారు. నిజానికి వీటి పరిమళం అధిక ఎక్కువసేపు ఉండాలంటే ఓ చిట్కాను పాటించాలి. పర్ఫార్మ్ వాసన శరీరం నుంచి త్వరగా వెళ్లిపోవడానికి ప్రధాన కారణం పెర్ఫ్యూమ్ ని సరైన విధానంలో వాడకపోవడం. వీటి పరిమళం చాలా కాలం పాటు ఉండాలంటే శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలపై అంటే మోచేతులపై, మెడ పైన పెర్ఫ్యూమ్ పోసినట్లైతే అది ఎక్కువ కాలం పాటు సువాసనను వెదజల్లుతుంది. శరీరంలో మరెక్కడా లేనంతగా వెచ్చగా ఉంటుంది. ఫలితంగా సువాసన మరింతగా వ్యాపిస్తుంది.
చాలా మంది గొంతు, మెడపై పెర్ఫ్యూమ్ లను వాడరు. శరీరంలోని ఈ భాగంలో పెర్ఫ్యూమ్ వాడడం వల్ల సువాసనలు అధిక సమయం పాటు వ్యాపిస్తాయి. పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే అది రోజంతా సువాసనను వెదజల్లుతుంది. ఇయర్ లోబ్ చాలా సున్నితమైన ప్రదేశం. పెర్ఫ్యూమ్ ని మెడపై, చెవుల వెనక వేసుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు ఉంటుంది. పొట్ట భాగంలో కూడా పెర్ఫ్యూమ్ ని వాడితే సువాసన చాలా ఎక్కువసేపు వస్తుంది. ఈ విషయం చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు. నిజానికి పొట్ట పైన పర్ఫ్యూమ్ రాసుకున్నట్లయితే చాలా ఎక్కువ సేపు ఉంటుందట. నాభి చుట్టూ వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సువాసన మరింత ఎక్కువగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.