CM Revanth Reddy: నీటి వాడకంపై నవంబర్ 1 నుంచి వచ్చే నిబంధనలేమిటి?

CM Revanth Reddy: నీటి వాడకంపై నవంబర్ 1 నుంచి వచ్చే నిబంధనలేమిటి?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ సంస్థల్లో తాగునీరు కాని అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని వినియోగించడం తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతుల్లోనే ఈ నిబంధనను చేర్చాలని, నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

CM Revanth Reddy Water Rules

ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి నివాసం వంటి చోట్ల మొక్కల పెంపకానికి శుద్ధి చేసిన నీటినే వాడాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ వెంబడి రోడ్ల శుభ్రత, పబ్లిక్ పార్కులు మరియు డేటా సెంటర్లలో కూడా ఇదే నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి:

రైల్వేలు, మెట్రో రైలు సంస్థలు కూడా తాగడానికి వీలులేని అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని కోరారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను హైడ్రాకు అప్పగించడంతో పాటు, ఎస్టీపీల నిర్వహణలో సౌర విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం..

Leave a Comment