Sai Pallavi: ఏంటి ఎంతో పద్ధతిగా ఉండే సాయి పల్లవికి ఆ హీరోయిన్ భర్త అంటే ఇష్టమా.. మేం వినేది నిజమేనా అనుకుంటారు ఆమె అభిమానులంతా.. కానీ మీరు వీనేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవి తన నోటితో బయటపెట్టిన విషయం.మరి ఇంతకీ సాయి పల్లవి అంతగా మనసు పడ్డ ఆ హీరో ఎవరబ్బా అనేది ఇప్పుడు చూద్దాం..
Does Sai Pallavi love that heroine’s husband
సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఫిదా సినిమా మాత్రమే ఈమెకు గుర్తింపు ఇచ్చింది.అయితే ప్రేమ మ్ మూవీలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది.కానీ ఫిదా సినిమాలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవి పాత్రకే మంచి గుర్తింపు లభించింది.(Sai Pallavi)
Also Read: Bunny: మెగా ఫ్యామిలీ పై బన్నీ కోపానికి కారణం తండ్రికి జరిగిన ఆ అవమానమేనా.?
అలా సాయి పల్లవి టాలీవుడ్ లో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకొని వరుస ఆఫర్స్ అందుకుంది. ముఖ్యంగా గ్లామరస్ పాత్రల్లో కాకుండా తన పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉంటుంది అనేదాన్ని మాత్రమే సాయి పల్లవి చూస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి కోలీవుడ్ నటుడు సూర్య అంటే చెప్పలేనంత ఇష్టమట. అంతేకాదు సూర్య తన ఫస్ట్ క్రష్ అని సాయి పల్లవి ఎన్నోసార్లు చెప్పింది.
అయితే ఇది ఇండస్ట్రీకి రాకముందు. కానీ ఇండస్ట్రీకి వచ్చాక తన ఫస్ట్ క్రష్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. అంతేకాకుండా తన మొదటి క్రష్ తో ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందని సాయి పల్లవి కలలో కూడా ఊహించలేదట. ఎందుకంటే సాయి పల్లవికి సూర్య హీరోగా చేసిన ఎన్జీకే మూవీలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.(Sai Pallavi)